YouTube channel subscription banner header

మళ్లీ తెరపైకి జెత్వానీ.. ఇద్దరు అధికారులపై వేటు!

Published on

సినీ నటి, మోడల్‌ జెత్వానీ కాదంబరి మళ్లీ తెరపైకి వచ్చారు. శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టిన కుక్కల విద్యాసాగర్‌తో పాటు ఐపీఎస్‌ అధికారులు ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ వేధింపులకు గురి చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో తాజాగా ఇద్దరు పోలీసులపై DGP ద్వారకా తిరుమలరావు వేటు వేశారు. అప్పట్లో జెత్వానీ కేసును డీల్ చేసిన ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ కేసులో మరో ఇద్దరు సీఐలు, ఓ ఎస్‌ఐపైనా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

కాదంబరి జెత్వానీ నెల రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారారు. వైసీపీని టార్గెట్ చేసేందుకే జెత్వానీ కేసును టీడీపీ అస్త్రంగా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగానే జెత్వానీని ముంబై నుంచి విజయవాడకు రప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే ఇదే సమయంలో విజయవాడను వరదలు ముంచెత్తాయి. దీంతో జెత్వానీ కేసు గురించి మాట్లాడితే విమర్శలు వస్తాయని టీడీపీ నేతలు మౌనం వహించారు. ఎక్కడా ఈ అంశం గురించి చర్చించలేదు. ఐతే విజయవాడలో పరిస్థితులు సాధారణస్థితికి రావడంతో మళ్లీ జెత్వానీని కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

పారిశ్రామికవేత్త సజ్జన్‌ జిందాల్‌కు మేలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని జెత్వానీ ఆరోపిస్తున్నారు. ఇక ఈ కేసును విచారణ చేయడానికి ప్రత్యేక అధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను నియమించింది కూటమి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో ఈ కేసు విష‌యంలో మరింత మంది పోలీసు అధికారులపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...