YouTube channel subscription banner header

రాజకీయరంగంలో స్టైల్‌ స్టేట్‌మెంట్స్‌

Published on

ఇండియన్ పాలిటిక్స్‌లో మహిళలు ప్రభావవంతంగా ఉన్నారు. సంఖ్యాపరంగా సగభాగస్వామ్యం లేదు. కానీ ఉన్న కొద్దిమంది సామాన్యులను ప్రభావితం చేయగలిగిన వారే. ముఖ్యంగా ఈ మహిళలు వేదిక మీద ఉంటే సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ అవుతున్నారు. సమావేశానికి నిండుదనం తెస్తున్నారు. వాళ్ల ఆహార్యం అందరినీ ఆకట్టుకుంటోంది.

ఒకప్పుడు ఎన్నికలకు రాజకీయ సభలు, సమావేశాలు, ప్రచారంలో స్టార్‌ అట్రాక్షన్‌ కోసం సినీ నటులను ఆశ్రయించాల్సి వచ్చేది. అలా మొదలైన స్టార్స్‌ ఎంట్రీ ఇప్పుడు రాజకీయరంగానికి గ్లామర్‌ టచ్‌నిస్తోంది. వారికి దీటుగా సినిమాలతో సంబంధం లేని పూర్తి రాజకీయ కుటుంబాల మహిళల్లోనూ ఐకానిక్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌లున్నారు. అలాగే ప్రజాఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన మహిళా నాయకులు కూడా ఆహార్యంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.

ప్రియాంక గాంధీ.. నాన్న పీఎం. నానమ్మ పీఎం. తాతగారు పీఎం. వాళ్లందరూ డ్రస్‌ సెన్స్‌లో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న వాళ్లే. ప్రియాంక కూడా సమావేశాల్లో చేనేత చీరలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కనిపిస్తారు. లైట్‌ షేడ్‌ కుర్తా, పైజమా ధరించినా, ఫేడెడ్‌ జీన్స్‌– వైట్‌ షర్ట్‌ ధరించినా గ్యాదరింగ్‌లో అందరి చూపు ఆమె మీదనే ఉంటుంది.

అగతా సంగ్మా.. అస్సాం సంప్రదాయ కట్టుకి వెస్టర్న్‌ టచ్‌ ఇస్తారామె. స్కర్ట్‌ ధరించినా సరే తన కోసమే ఇలా డిజైన్‌ చేశారా అన్నట్లు ఉంటుంది. నిరాడంబరంగా కనిపిస్తూనే స్టయిలిష్‌గా ఉంటుంది.

బృందాకారత్‌.. అభ్యుదయ భావాలకు సంప్రదాయ ఆహార్యాన్ని అద్దినట్లు ఉంటారు. పెద్ద అంచు చీర, ఎర్రటి పెద్ద బొట్టు ఆమె సిగ్నేచర్‌.

అల్కాలాంబా.. హాలిడే టూర్‌లలో స్పోర్ట్స్‌ వేర్‌ ధరిస్తుంది. పార్లమెంట్‌ సమావేశాలకు చీరకట్టులో కనిపిస్తారు. డ్రెస్‌ సెలెక్షన్‌ ఆమె యూఎస్‌పీ.

డింపుల్‌ యాదవ్‌.. బాలీవుడ్‌ సినిమాలో వదినలా ఉంటుంది. ప్లెయిన్‌ కుర్తాపైజమాకు పెద్ద ఫ్లోరల్‌ ప్రింట్‌ దుపట్టా, చిన్న పువ్వులున్న లైట్‌ కలర్‌ చీరలతో హుందాతనానికి నిరాడంబర మేళవిస్తే డింపుల్‌ అవుతుంది.

వసుంధర రాజె.. ఈమె వజ్రాల ముక్కు పుడక, పెద్ద పువ్వులున్న ముదురు షిఫాన్‌ చీరలు, పెద్ద బొట్టు.. మధ్య తరగతి మహిళను ఆకట్టుకునేలా ఉంటుంది.

నిర్మలాసీతారామన్‌.. ఈమెకు దుస్తుల ఎంపిక మీద పెద్దగా పట్టింపు ఉన్నట్లు కనిపించదు. కానీ, ప్రత్యేక సమావేశాలకు హ్యాండ్‌లూమ్‌ చీరల ఎంపికలో చక్కటి అభిరుచి వ్యక్తమవుతుంటుంది.

ఇక బాలీవుడ్‌ తారల విషయానికి వస్తే..
హేమమాలిని.. ఈ డ్రీమ్‌ గర్ల్‌ సినిమా గ్లామర్‌కే కాదు, వరల్డ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌. ఆమె దుస్తులతోపాటు హ్యాండ్‌బ్యాగ్‌ ఇతర యాక్సెసరీస్‌ అన్నీ ఆమె అందంతో పోటీ పడుతుంటాయి. నిజానికి డ్రీమ్‌గర్ల్‌ను చూస్తున్న కళ్లకు ఆమె యాక్సెసరీస్‌ మీద దృష్టి పెట్టవు.

మిమి చక్రవర్తి.. తాజాగా రాజకీయరంగంలో అడుగు పెట్టిన ఈ బెంగాలీ నటి ర్యాంప్‌ మీద క్యాట్‌ వాక్‌ చేస్తున్నట్లే ఉంటుంది.

స్మృతి ఇరానీ.. మోడలింగ్‌తో కెరీర్‌ మొదలు పెట్టిన టీవీ సీరియల్‌ నటి ఆహార్యం రాజకీయాలకు అచ్చంగా అమరిపోయినట్లు ఉంటుంది. బొట్టుతోపాటు ఆమె చీరల రంగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తుంది.

కిరణ్‌ ఖేర్‌.. బాలీవుడ్‌ నటిగా కెరీర్‌ మొదలు పెట్టి ప్రజాప్రతినిధిగా సమర్థవంతంగా ఉన్న ఈమెకు దక్షిణాది కంచిపట్టు చీరలంటే ఇష్టం. గాఢమైన కంచిపట్టు రంగులు ఆమె స్కిన్‌టోన్‌కి కొత్త కళను తీసుకువస్తాయి.

ప్రియాదత్‌.. ఈమె కుర్తా, లెగ్గింగ్, సల్వార్‌లతో క్యాజువల్‌ వేర్‌లో కాలేజ్‌కెళ్తున్నట్లు, ఆఫీస్‌కెళ్తున్నట్లు కనిపిస్తుంది.

షైనా.. ఈమెది సినీరంగం కాదు కానీ, గ్లామరస్‌ టచ్‌ ఉన్న ఫ్యాషన్‌ ఇండస్ట్రీ నేపథ్యం. క్వీన్‌ ఆఫ్‌ డ్రేప్స్‌ అవార్డు అందుకుంది. చీరను 44 రకాలుగా ధరించడంలో నేర్పరి. చీర ఏదైనా సరే ధరించడంలో వైవిధ్యత ఆమె ప్రత్యేకత.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...