ఏపీలో రోజురోజుకి ఎన్నికల హీట్ ఎక్కువవుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. తాజాగా అధికార వైసీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.
పవన్ కల్యాణ్‌కు దమ్ముంటే తనపై కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటి చేయాలని సవాలు విసిరారు. ఎన్నికల్లో పవన్‌పై తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి విసిరిన సవాల్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంతవరకు స్పందించలేదు.
దీంతో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “పవన్ కల్యాణ్ నా సవాల్‌పై స్పందించలేదు. నాపై పోటికి భయపడితే తాను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని” అన్నారు. తనకు భయపడి పవన్ తోక ముడిచారని అన్నారు.