బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరిపై భీమవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ విమర్శల వర్షం కురిపించారు. భీమవరంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఈ కామెంట్స్ చేశారు. పురందేశ్వరి ఓ ఊసరవెల్లి అని ఆయన ఆరోపించారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చే ఆమె వైసీపీని విమర్శించడం తగదన్నారు. పురందేశ్వరి బీజేపీలో ఉంటూ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తోందని విమర్శించారు.ఆమె మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇక, జగన్, పవన్ లపై కూడా విమర్శల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాకు భీమవరంలో పోటీ చేయగలరా అని ప్రశ్నించారు.
చంద్రబాబు పేదల గురించి ఏనాడు పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోని పార్టీ సైట్ నుంచే తొలగించాడని గుర్తు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్నారని, అలాంటి జగన్ పై నిందలు వేయడం హాస్యాస్పదకరం అన్నారు. జగన్ లాంటి నాయకుడిని భారతదేశ చరిత్రలో చూడలేదన్నారు. ఇచ్చిన వాగ్దానాలు నూటికి నూరు శాతం అమలు చేసిన ముఖ్యమంత్రి అని జగన్ పై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా విద్య, వైద్యం, ఆర్థిక పరంగా చితికిపోకూడదనే ఆశయంతో సీఎం పని చేస్తున్నారని ఆయన అన్నారు.