వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి వచ్చే ఎన్నికల బరిలోకి దిగబోతున్నాయి. అయితే ఎన్ని పార్టీలు కలిసినా గెలుపు మాత్రం వైసీపీదే అంటూ ఇప్పటికే ఎన్నో సర్వేలు ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా కూటమిలోకి బీజేపీ చేరటం వైసీపీ ప్రభుత్వానికి ప్లస్ పాయింట్ అవుతుందని తెలుస్తుంది.
గతంలో జన్మత్ సంస్థ నిర్వహించిన సర్వేలలో వైసీపీ ప్రభుత్వానికి 114 నుంచి 117 సీట్లు వస్తాయని వెల్లడించింది. అయితే ప్రస్తుతం కూటమిలో బీజేపీ చేరిన తరువాత జగన్మోహన్ రెడ్డి పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య కూడా పెరిగిందని తెలుస్తోంది. కూటమిలో బీజేపీ చేరిక తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి ఈ క్రమంలోనే ఈ విషయంపై పలు సర్వేలు నిర్వహించగా వైసీపీ ఏకంగా 119 నుంచి 124 స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.
ఇక ఈ సర్వే ప్రకారం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి 49 నుంచి 51 అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే కాకుండా పార్లమెంటు స్థానాలు కూడా వైసీపీ అధిక సీట్లను గెలుచుకునే అవకాశాలు కనపడుతున్నాయని ఈ సర్వేలో వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాల్లో వైసీపీ 19 – 20 స్థానాల్లో గెలుపొందుతుందని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీల కూటమికి 5 – 6 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ జన్మత్ సర్వే తెలిపింది. వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే అంశంపై ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు నిర్వహించగా, ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం గమనార్హం.