సినీనటుడు బ్రహ్మాజీ మరోసారి వార్తల్లో నిలిచారు. అప్పుడప్పుడు రాజకీయాలపై కామెంట్స్ చేయడం బ్రహ్మాజీకి అలవాటు. తాజాగా ఆయన వైసీపీ అధినేత జగన్‌ను ఆయన టార్గెట్ చేశారు. విజయవాడలో వరదలు వచ్చి 8 రోజులు గడుస్తున్నా బాధితులకు సహాయం అందట్లేదంటూ ప్రభుత్వానికి 8 ప్రశ్నలు సంధించారు వైసీపీ అధినేత జగన్. వరద బాధితులను ఆదుకోకపోతే వైసీపీ తరపున పోరాటాలు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐతే జగన్ ట్వీట్‌పై సెటైరికల్‌గా స్పందించారు బ్రహ్మాజీ. దీంతో వైసీపీ కార్యకర్తలు బ్రహ్మాజీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇంతకీ బ్రహ్మాజీ ఏమన్నారంటే!
జగన్ ట్వీట్‌కు స్పందించిన బ్రహ్మాజీ.. మీరు కరెక్ట్ సార్.. వాళ్లు చేయలేరు. ఇకనుంచి మనం చేద్దాం సార్. ఫస్ట్ మనం వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేద్దాం సార్. మన వైసీపీ కేడర్‌ను రంగంలోకి దింపుదాం. మనకీ జనాలు ముఖ్యం సార్. గవర్నమెంట్ కాదు సార్. మనం చేసి చూపిద్దాం సార్. జై జగన్ అన్న అంటూ వ్యంగ్యంగా తన ట్వీట్ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ వైసీపీ కార్యకర్తల ఆగ్రహానికి దారితీసింది. దీంతో బ్రహ్మాజీని టార్గెట్ చేశారు వైసీపీ కార్యకర్తలు.
వైసీపీ కార్యకర్తల నుంచి తీవ్రమైన ట్రోలింగ్ ఎదురుకావడంతో ఉదయానికి తన ట్వీట్ డిలీజ్ చేసుకున్నారు బ్రహ్మాజీ. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని, ఆ ట్వీట్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఫిర్యాదు కూడా చేశామంటూ తాజాగా మరో ట్వీట్ చేశారు. గతంలో హైదరాబాద్ వరదల సమయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు బ్రహ్మాజీ. ఇది మా ఇంటి పరిస్థితి.. ఓ మోటరు బోటు కొనాలనుకుంటున్నా.. దయచేసి ఏదైనా మంచి పడవ గురించి సలహా ఇవ్వాలంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో బ్రహ్మాజీపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. కష్ట సమయంలో సాయం చేయకుండా సెటైర్లు వేస్తావా అంటూ బ్రహ్మాజీని ట్రోల్ చేశారు నెటిజన్లు. దీంతో తన ట్విట్టర్‌ను డియాక్టివేట్ చేసుకున్నారు. తాజాగా మరోసారి వైసీపీ నేతలను రెచ్చగొట్టి మళ్లీ తన ట్వీట్‌ను డిలీట్ చేసుకున్నారు.