సీఎం జగన్ రెడ్డిని తక్కువ చేయడంలో ఎల్లో మీడియా ఎప్పుడూ ముందుంటుంది. ఆయన అభివృద్ధిని చూసి ఏడుస్తూనే ఉంటుంది. ఆయన ఏం చేసినా, చేయకపోయినా తమ అక్కసు మాత్రం వెళ్లగక్కుతూనే ఉంటుంది. తాజాగా జగన్ ఢిల్లీ టూర్‌పై కూడా ఇదే ఏడుపు ఏడ్వటం విశేషం.
ఢిల్లీ వెళ్లిన జగన్‌కి అవమానం జరిగిందని, గంటలు నిరీక్షించినా ప్రధాని మోడీ ఆయనకు ఎక్కువ సమయం ఇవ్వలేదని..కేవలం 15 నిమిషాల సమయమే ఇచ్చారని.. ఆ సమయంలోనూ రాజకీయాల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అని ఎల్లో మీడియా రాసింది. అంతేనా.. అమిత్ షా అయితే కనీసం జగన్‌ని పట్టించుకోలేదని.. నిరాశతోనే ఆయన తిరిగి వచ్చేశారని చెప్పింది.
జగన్‌కి అవమానం జరిగిందని తెగ సంబరపడిపోయింది ఎల్లో మీడియా.. అయితే అందుకు భిన్నంగా అక్కడ జరగడం విశేషం. జగన్ హవాను తట్టుకోలేక పూర్తిగా రివర్సులో కథనాలు రాసి ఆనందిస్తోంది. మోడీ-జగన్ మధ్య భేటీ దాదాపు గంటసేపు జరిగినట్లు మెజారిటి మీడియా చెప్పింది.
జగన్‌కు అపాయిట్మెంట్ ఇచ్చింది 15 నిమిషాలే అయినా గంటసేపు మాట్లాడినట్లు ఢిల్లీ మీడియా చెప్పింది. గంటసేపు మాట్లాడుకున్నాక అందులో రాజకీయాలు కూడా ఉండే ఉంటుందనటంలో సందేహంలేదు. కాకపోతే వాళ్ళిద్దరు ఏమి మాట్లాడుకున్నారనే విషయాలు బయటకు తెలిసే అవకాశంలేదు. కానీ ఎల్లో మీడియా మాత్రం రాజకీయాలు మాట్లాడేందుకు మోడీ అవకాశం ఇవ్వలేదని చెప్పటమే విచిత్రంగా ఉంది. జగన్‌కు వ్యతిరేకంగా ఎల్లో మీడియా ముందు రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే కథనం ఇచ్చేసింది.
ఇక అమిత్ షా అసలు జగన్‌కు అపాయిట్మెంటే ఇవ్వలేదని చెప్పింది. అసలు అమిత్ షాను కలవటం జగన్ షెడ్యూల్లో ఉందో లేదో తెలీదు. పైగా మోడీతోనే గంటసేపు మాట్లాడిన తర్వాత ఇక అమిత్ షా మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత? జగన్ నిరాశతో వెనక్కు వచ్చేశారని ఎల్లో మీడియా ఎలా చెప్పింది? అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయం ఎవరికీ తెలియదు.. అక్కడ ఏం జరిగినా జగన్‌కి అవమానం జరిగింది అని రాయాలి అని ముందే కథనం రాసిపెట్టుకుంది. అందుకే.. ఎల్లో మీడియా అదే అచ్చు వేసింది.
ఇక.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ఆరు గంటలకు కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. మరి.. ఇది చంద్రబాబుకి జరిగిన అన్యాయం కాదా? అమిత్ షాతో భేటీ సవ్యంగా జరిగి ఉంటే ఈ పాటికి చంద్రబాబు మీడియాతో మాట్లాడేవారు కదా.. అలా మాట్లాడలేదు అంటే ఆయనకు అనుకూలంగా జరగలేదనే విషయం అర్థం కావడం లేదా? ఈ విషయాలన్నీ ఎక్కడ బయటకు వస్తాయో అని… జగన్‌పై లేనిపోని బురద జల్లుతున్నారు.