YouTube channel subscription banner header

మహిళా కానిస్టేబుల్ కి మద్దతుగా వైసీపీ ట్వీట్

Published on

గుంటూరు జిల్లా సబ్ జైలు ముందు మాజీ సీఎం జగన్ తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ ఆయేషాబానుకి పెద్ద చిక్కు ఎదురైంది. ప్రతిపక్ష నేతతో సెల్ఫీ దిగడం, అది కూడా డ్యూటీలో ఉండి, యూనిఫామ్ లో ఉండి సెల్ఫీకోసం ఆసక్తి చూపించడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ప్రభుత్వం కూడా ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు చార్జ్ మెమో ఇస్తామని జైలర్ రవిబాబు చెప్పిట్టు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై వైసీపీ స్పందించింది. ఉద్యోగులను వేధించడంలో కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని వైసీపీ ట్వీట్ వేసింది.

https://x.com/YSRCParty/status/1834433705533681667

జగన్ తో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్‌పై కూటమి ప్రభుత్వం కక్ష కట్టిందని అంటున్నారు వైసీపీ నేతలు. దీనిపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి స్పందించాలని వారు డిమాండ్ చేశారు. సీఎం, హోం మినిస్టర్ ని ట్యాగ్ చేస్తూ వైసీపీ తరపున ట్వీట్ వేశారు. ఈ సెల్ఫీ వ్యవహారం వైరల్ అయిన తర్వాత ఆమెపై చర్యలు ఉంటాయనే ప్రచారం జరిగింది. టీడీపీ అనుకూల మీడియా కూడా ఆమెను టార్గెట్ చేస్తూ వార్తలిచ్చింది. తాజాగా ఆమెకి చార్జ్ మెమో ఇవ్వబోతున్నారనే వార్తల్ని కూడా అదే మీడియా హైలైట్ చేసింది. ఈ వ్యవహారాన్ని వైసీపీ ఖండిస్తోంది.

గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కదిరి సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ ఉదంతాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నా కూడా ఆ పార్టీ నేతలకు మాధవ్ వార్నింగ్ ఇచ్చారు. మీసం మెలేసి సవాల్ విసిరారు. సీన్ కట్ చేస్తే వెంటనే ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వీడియో కాల్ వ్యవహారంతో ఆయన్ను పార్టీ పక్కనపెట్టింది. ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నారని తెలిసి కూడా డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ మీడియా ముందు సెల్ఫీ కోసం హడావిడి చేశారు. ఈ వ్యవహారం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...