దసరా సంబరాల్లో భాగంగా గురువారం సాయంత్రం విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
*విజయవాడ- దసరా ఉత్సవాల్లో సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వాహాకులు గొల్లపూడిలో ఏర్పాటు చేసిన ఎక్స్ పో గ్రౌండ్సులోని ఎగ్జిబిషన్ను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
- ఎక్స్ పోలో ఏర్పాటు చేసిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన రోబో వంట శాలను సందర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.
- రోబో వంటశాలలో ఏఐ సహకారంతో వండిన చిల్లీ పన్నీర్ వంటకాన్ని రుచి చూసి బాగుందని కితాబిచ్చిన సీఎం.
- గొల్లపూడి ఎక్స్ పో గ్రౌండ్సులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి
- వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆసక్తిగా పరిశీలించిన సీఎం చంద్రబాబు, ఆర్గానిక్ వ్యవసాయం పై దృష్టి సారించాలని అధికారులకు దిశా నిర్ధేశం చేసిన సీఎం చంద్రబాబు..
- అనంతరం వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించిన సీఎం చంద్రబాబు
- కార్యక్రమంలో భాగంగా లార్జెస్ట్ డప్పు ఆర్టిస్ట్స్ ర్యాలీ సాధించిన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ ను అందచేశారు.
- ఎంపి కేశినేని శివనాథ్(చిన్ని) మాట్లాడుతూ దసరా మహోత్సవాలను పురష్కరించుకుని విజయవాడ నగరంలో 5 ప్రాంతాల్లో 280 ఈవెంట్ లు విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రదర్శనలకు విశేషంగా వీక్షకులు రావడం అభినందనీయమన్నారు.
- ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ ఒక నాడు విజయవాడ కళలకు, సాహిత్యానికి రాజధానిగా ఉండేదాని కొన్ని పరిస్థితుల దృష్ట్యా విజయవాడ నాటి వైభవాన్ని కోల్పోయిందని, మళ్లీ దార్శనికుడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో విజయవాడకు పూర్వ వైభవం వచ్చిందన్నారు.
- కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డిద పట్టాభిరామ్, కలెక్టర్ లక్ష్మీశా, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
