YouTube channel subscription banner header

చంద్రబాబుతో బీజేపీ ఆడుకుంటోందా?

Published on

పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం అనే సామెత టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి సరిగ్గా సరిపోతుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలను గమనిస్తుంటే చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది. విషయం ఏమిటంటే ఒకవైపు ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన అభ్యర్థులను ఫైనల్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అభ్యర్థులు కూడా తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని పదేపదే గొంతు చించుకుంటున్న చంద్రబాబు పొత్తులు, సీట్ల సర్దుబాటు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోతున్నారు.

ఒక్క జనసేనతో మాత్రమే పొత్తుండుంటే పవన్ కల్యాణ్‌ను ఏదోలా మ్యానేజ్ చేసి సీట్ల సంఖ్య, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఫైనల్ చేసేసుండేవారే. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా అయిపోయిందని అనుకుంటున్న సమయంలో సడెన్‌గా బీజేపీ దూరింది. టీడీపీ కూటమిలో బీజేపీ కూడా పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే చంద్రబాబు పరిగెత్తుకుని ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు కాబట్టి.

ఢిల్లీకి వెళ్ళొచ్చిన దగ్గర నుండి చంద్రబాబు మళ్ళీ ఇంతవరకు పొత్తులు, సీట్ల సర్దుబాటుపై నోరిప్పింది లేదు. పోటీ చేసే అవకాశం వస్తుందో లేదో తెలియ‌క‌ తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోయి గొడవలైపోతున్నాయి. జనసేనలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనబడుతోంది. కొన్ని నియోజక‌వర్గాల్లో తమ్ముళ్ళకి, జనసేన నేతలకు మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. అసలీ గొడవలతో సంబంధం లేకుండా హ్యాపీగా ఉన్నది బీజేపీ మాత్రమే. పొత్తులపై అర్జంట్‌గా తేల్చాల్సిన అవసరం ఏమొచ్చిందని అమిత్ షా ఒక సమావేశంలో అన్నారు.

నిజమే, పొత్తుపై తేల్చాల్సిన అత్యవసరం బీజేపీకి లేకపోవచ్చు కాని పొత్తు పెట్టుకోవాలని ఆతృతపడుతున్న చంద్రబాబుకు చాలా ఉంది. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాకపోయినా జరిగే నష్టం లేదు. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్నదే గోచి. అది ఉన్నా ఒకటే ఊడినా ఒకటే. కానీ చంద్రబాబు పరిస్థితి అది కాదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే చంద్రబాబు రాజకీయ జీవితం ముగియటంతో పాటు లోకేష్ భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. ఏపీలో టీడీపీ పరిస్థితి తెలంగాణలో అయినట్లు అయిపోతుంది. అందుకనే పొత్తు, సీట్ల సర్దుబాటు ఫైనల్ అవ్వాలని చంద్రబాబు తొందరపడుతుంటే బీజేపీ నింపాదిగా ఉంది. కొంతకాలం గడిపిన తర్వాత పొత్తుండదని బీజేపీ ప్రకటిస్తుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే చంద్రబాబుతో బీజేపీ ఆడుకుంటోందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...