YouTube channel subscription banner header

చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేయరా..?

Published on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పోటీ చేయడానికి కూడా వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన కుప్పం నుంచి పోటీ చేయరు అనే ప్రచారం ఎక్కువైంది. ఈ ప్రచారానికి కారణం లేకపోలేదు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి మాటలు ఆ సందేహం కలగడానికి కారణమయ్యాయి.

కుప్పం నగరానికి వైఎస్‌ జగన్‌ కొద్దిరోజుల్లో మంచినీటిని విడుదల చేస్తున్నారు. నియోజకవర్గంలోని వ్యవసాయ భూములకు ఇప్పటికే సాగునీరు అందుతోంది. కుప్పం నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. వాటిని చూపించి టీడీపీ స్థానిక నాయకులను రామచంద్రారెడ్డి తమ వైపు తిప్పుకున్నారు. కుప్పంలో చంద్రబాబును ఓడించ‌డ‌మే లక్ష్యంతో ఆయన చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్నారు.

‘‘కుప్పం వచ్చాను… ఇక్కడ నాకొక కోరిక ఉంది. నా మనసులో ఎప్పటి నుంచో ఆ కోరిక ఉంది. నేనేమీ మిమ్మల్ని కొట్టను… తిట్టను. 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పం ఎమ్యెల్యేగా ఉన్నాడు. ఇప్పుడు నాకొక కోరిక ఉంది. ఆయన్ను రెస్ట్‌ తీసుకోమని చెప్పుతున్నా. నేనే ఇక్కడి నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్నా’’ అని భువనేశ్వరి సభకు వచ్చినవారిని ఉద్దేశించి అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

అయితే, తాను సరదాగా ఆ మాటలు అన్నానని, తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని భువనేశ్వరి అన్నట్లు కూడా మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, భువనేశ్వరి సరదాగానే ఆ మాటలు అన్నారా, దాంట్లో మతలబు ఏమైనా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ ప్రకటన చేసి ప్రజల నాడిని పట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో భాగంగానే భువనేశ్వరి చేత చంద్రబాబు అలా మాట్లాడి ఉండవచ్చునని పరిశీలకులు అంటున్నారు. భువనేశ్వరిని పోటీకి దింపి.. అక్కడ ఓడిపోయినా ఆ ఎఫెక్ట్ తన మీద పడకుండా ఉండాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే.. మరి చంద్రబాబు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో..?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...