YouTube channel subscription banner header

ఉండవల్లి ఆరోపణలకు సాక్ష్యాలు ఇవేనా?

Published on

రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, నిధుల దుర్వినియోగం జరుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. అవి ఆరోపణలే అని చాలా మంది పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడ అవే నిజం అని తెలుస్తోంది. దశాబ్దాలుగా కోర్టుల్లో నానుతున్న మార్గదర్శి కేసు తొందరలో ఫైనల్ అయ్యే అవకాశాలు పెరుగుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో రామోజీ వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తేన్నారన్నది ఉండవల్లి అరోపణ.

ఎందుకంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ ముసుగులో హెచ్‌యూఎఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా డిపాజిట్లు వసూలు చేయటం తప్పని ఇప్పటికే తేలిపోయింది. అందుకనే డిపాజిట్లన్నింటినీ వెనక్కు ఇచ్చేయమని కోర్టు ఆదేశించింది. కొంతకాలం విచారణ తర్వాత రామోజీ సేకరించిన డిపాజిట్లన్నింటినీ వెనక్కిచ్చేసినట్లు చెప్పారు. అయితే ఉండవల్లి సీన్లోకి ఎంటరై మార్గదర్శి వెనక్కిచ్చేసిన డిపాజిట్‌దారుల వివరాలను తనకు ఇవ్వమని అడిగారు. అలాగే ఈనాడు పత్రికలోనే డిపాజిట్‌దారుల వివరాలను ప్రకటించేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును కోరారు.

అయితే ఉండవల్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ డిపాజిట్ దారుల వివరాలను మాత్రం రామోజీ ప్రకటించలేదు. ఇక్కడే ఉండవల్లి చేసిన బ్లాక్ మనీ ఆరోపణలు నిజమనే అనుమానాలు మొదలయ్యాయి. సేకరించిన రూ.2600 కోట్లు అచ్చంగా నిజమైన డిపాజిట్‌దారుల నుండే అయితే వాళ్ళ వివరాలను పేపర్లో ప్రకటించటానికి అభ్యంతరం ఏంటని ఉండవల్లి ప్రశ్నిస్తూ వచ్చారు.

డిపాజిట్‌దారుల వివరాలను రామోజీ ప్రకటిస్తే అందులో నిజమైన డిపాజిట్‌దారులు ఎవరు? బోగస్ డిపాజిట్‌దారులు ఎవరన్న విషయం ప్రపంచానికి తెలిసిపోతుంది. ఉండవల్లి ఆరోపణల ప్రకారం చాలామంది బిగ్ షాట్స్ తమ బ్లాకమనీని మార్గదర్శిలో దాచుకున్నారట. మార్గదర్శి ముసుగులో రామోజీ చేస్తున్నది చిట్ ఫండ్స్ వ్యాపారం కాదని అసలు వ్యవహారం బ్లాక్ మనీ సర్క్యులేషన్ అని ఉండవల్లి చాలా సార్లు బల్లగుద్ది మరీ చెప్పారు.

మాజీ ఎంపీ అంచనాల ప్రకారం మార్గదర్శిలో వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీ సర్క్యులేట్ అవుతోందట. అందులో బ్లాక్ మనీని దాచుకున్న బడాబాబుల బండారమంతా బయటపడుతుందనే డిపాజిట్‌దారుల వివరాలను రామోజీ ప్రకటించటంలేదని చాలాసార్లు ఉండవల్లి ఆరోపించారు. మరి కేసు క్లైమ్యాక్స్ కు వస్తున్న సమయంలో అయినా డిపాజిట్‌దారుల వివరాలను రామోజీ పేపర్లలో ప్రకటిస్తారా? ప్రకటించేలా కోర్టు చేస్తుందా? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. మరి.. ఉండవల్లి చెప్పింది నిజమవుతుందా లేక.. రామోజీది తప్పేమీ లేదని రుజువు అవుతుందో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...