YouTube channel subscription banner header

ప్రజల మనిషిలా పెద్ద పోజు.. చంద్రబాబు అసలు పేరు విషనాగు!

Published on

చంద్రబాబు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. పేదల‌ సంక్షేమం గురించి ఆందోళన చెందుతున్నాడు. అధికారంలోకి వచ్చేస్తున్నాననీ, అభివృద్ధి తప్పితే తనకి మరో ఆలోచన లేదనీ అరచేతిలో స్వర్గం చూపిస్తున్నాడు. జనం నమ్ముతున్నారో లేదో తెలియ‌దు గానీ పవన్‌ కళ్యాణ్‌ నూరు శాతం నమ్ముతున్నారు. మహా నాయకుడు ఎన్టీ రామారావు ఏనాడో స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు దొంగ, శనిగ్రహం, నీచుడు, కుట్రదారు, నమ్మించి నట్టేట ముంచే రకం అని..!

పవన్‌ కళ్యాణ్‌ వేలాది జనం సాక్షిగా చెబుతున్నాడు. చంద్రబాబు అంటే పేదలకు మేలుచేసేవాడు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేవాడు, పారిశ్రామికవేత్తల్ని రప్పించేవాడు, మన బతుకుల్ని బాగుచేసే దేవుడు, అందుకే ఆయనతో పొత్తు అని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. అంతటితోనే ఆగిపోలేదు. చంద్రబాబు అంటే చిరాకు పడుతున్న బీజేపీని కూడా బతిమాలి బామాలి టీడీపీతో పొత్తు పెట్టుకోమని అంటున్నాడు. ఇంత‌కీ చంద్రబాబుకు మార్కెటింగ్‌ మేనేజర్‌గా పనిచేయాల్సిన దుర్గతి పవర్ స్టార్‌కి ఎందుకు పట్టినట్టు..?

చంద్రబాబు కోట్లకు పడగలెత్తిన కమ్మ వ్యాపారస్తుల కోసం పనిచేశాడు. రామోజీరావు అనే పచ్చి వడ్డీ వ్యాపారి ఆస్తులు పెరగ‌డం కోసం అనేక అక్రమాలకు ఒడిగట్టాడు. ఇప్పుడు తీరిగ్గా ప్రజల కోసం ప్రాణం ఇస్తా అంటుంటే ఎలా నమ్మడం..? ఇది ఇంగితం జ్ఞానం. అవును చంద్రబాబు ప్రజల కోసమే నిలబడతాడనీ, బతుకుల్ని బంగారం చేస్తాడనీ పవన్‌ కళ్యాణ్‌ బాకా వూదడం దేనికి..? ఏం సాధించడానికి..? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కాపులకు చేసిందేమిటి..? ఒట్టి మాటలు, పిచ్చి వాగ్దానాలు, కడుపు నింపేలా కల్లబొల్లి కబుర్లు..! అసంఖ్యాకంగా ఉన్న కాపుల్ని, బీసీలనీ ఉద్ధరించడానికి చంద్రబాబు కొద్దిపాటి ప్రయత్నం కూడా చేయలేదు. కాపులకు నిర్భయంగా ద్రోహం చేసినవాడు, బీసీల సంక్షేమాన్ని తుంగలో తొక్కిన వాడూ చంద్రబాబు. పవన్‌ కళ్యాణ్‌ అంత అమాయకుడా..! చంద్రబాబు పల్లకీని కాపుల‌తో మోయించి ఏం సాధిద్దామని..!

జనాన్ని ఉత్తేజపరచగల సినీ హీరోగా హారతులందుకుంటున్న పవర్‌ స్టార్‌కి ఈ అవమానకరమైన బ్రోకరేజి అవసరమా..? కెరటాలై పొంగుతున్న కాపుల ఉత్సాహాన్ని, అధికారాన్ని అందుకోవాలన్న కాపు శ్రేణుల ఆశయాన్నీ, చంద్రబాబు అనే ఒక రాజకీయ విషనాగు పాదాల చెంత తాకట్టుపెట్టడం సహించే విషయమేనా..! 24 సీట్లతో కుదేలైన కాపులు, కమ్మ పవర్‌కి తలవంచడానికి సుతరామూ ఇష్టపడని కాపులు, పవన్‌ కళ్యాణ్‌ మాట ఎలా వింటారు..? తెలుగుదేశం పసుపు పల్లకీని ఎందుకు మోస్తారు..?

కాపుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పవన్‌–చంద్రబాబు వ్యూహం బూమరాంగ్‌ అవుతోంది. వందల కోట్ల నోట్లు చేతులు మారడమేనా కారణం..! అనే సందేహానికి అవుననే సమాధానం దొరుకుతోంది. కాపు అనే కరెంటు వైరు మీద కమ్మవారు బట్టలు ఆరేసుకుంటే ఏమవుతుందో రెండు నెలల్లోనే మీకు తెలిసిపోతుంది..! పిఠాపురం పిలుస్తోందిరా..! కదలిరా..!

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...