జనసేన అధినేత పవన్ కల్యాణ్ మానసిక రోగిలా మారిపోయాడని ప్రభుత్వ విప్, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. పవన్ మెంటల్ ఇంబ్యాలెన్స్‌తో మాట్లాడుతున్నాడని ఆయన తెలిపారు. గురువారం ఆయన భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 24 సీట్ల కోసం కక్కుర్తిపడి చంద్రబాబు కాళ్ల దగ్గర పడి ఉన్నాడని ఆయన ఎద్దేవా చేశారు. పవన్ తీరు చూసి ఇదేం ఖర్మని జనసేన కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని గ్రంధి శ్రీనివాస్ చెప్పారు.
పవన్‌కి దృష్టి లోపం ఉన్నట్టుందని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ఆయన కళ్లకు కనపడటం లేదన్నారు. పవన్ కల్యాణ్ నాలుగో పెళ్ళాం నాదెండ్ల మనోహర్.. అని ప్రజలు అనుకుంటున్నారని, నాదెండ్ల మనోహర్‌కి మీకు ఉన్న సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు, పవన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉంటాయా అని ఈ సందర్భంగా గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. వీరికి ఓటేయకపోతే పాతాళానికి తొక్కేస్తారా? మక్కెలిరగదీస్తా.. తొక్కేస్తా.. అంటారా? అంటూ ఆయన నిలదీశారు. పేదల భవిష్యత్తు కోసం ఏం చేస్తారనేది పవన్ చెప్పడం లేదని, కేవలం జగన్‌పై ఈర్ష ద్వేషాలతోనే పవన్ మాట్లాడుతున్నాడని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా.. జడవని వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
అబద్ధాలకు, అసత్యాలకు, దగాకు, మోసానికి కేరాఫ్ అడ్రస్‌గా చంద్రబాబు నాయుడు నిలుస్తారని గ్రంధి శ్రీనివాస్ చెప్పారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశాడని తెలిపారు. చంద్రబాబు ఇచ్చిన 600 హామీల్లో ఎన్ని నెరవేర్చారో ప్రజలకు చెప్పాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. తాను ఇచ్చిన హామీలు నెరవేర్చానని చెప్పి ఓటు అడిగే దమ్ము చంద్రబాబుకు లేదని చెప్పారు. మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటేయండి.. అంటూ ధైర్యంగా అడుగుతున్న దేశంలోనే మొదటి నాయకుడు వైఎస్ జగన్ అని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.