జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి దాదాపు పది సంవత్సరాలు పైన అవుతుంది. ఇప్పటివరకు ఆయన కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు. ఇలా 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన తర్వాత కూడా పవన్ డిపాజిట్లు కోల్పోతున్నారు అంటే అందుకు కారణం లేకపోలేదు. తన అహంకారమే తనని రాజకీయంగా దెబ్బతీస్తుందనే విషయాన్ని పవన్ గుర్తించలేకపోవటం గమనార్హం.
ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి తనతో విభేదించేవారిని కూడా తనతో నడిపించగలగే సత్తా ఉండాలి. కానీ ఈయన మాత్రం నా మాటే శాసనం నేను చెప్పినదే వినాలి అంటూ కార్యకర్తలకు, నేతలకు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఎప్పుడు తను చెప్పినట్టే వినాలని పార్టీలో ఏకాభిప్రాయమే ఉండాలి కానీ భిన్నాభిప్రాయాలు ఉండకూడదన్న ధోరణిలో పవన్ ఉంటున్నారు.
ఇక ఏదైనా సభలలో ఈయనకు మైక్ చేతికి చిక్కితే కుప్పిగంతులు వేస్తుంటారు, పిచ్చి పట్టినట్టు మాట్లాడుతుంటారు. ఆయన వేదికలపై ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. మాట మాట్లాడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అహంకారం అని మాట్లాడుతారు. అసలు అహంకారం గురించి పవన్ మాట్లాడటం వింటే అందరికీ నవ్వు వస్తుంది. ఒంటినిండా అహంకారంతో పిచ్చివాగుడువాగే పవన్ కు రాజకీయ పరిణితి లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి ఆయన అహంకారం గురించి మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
సొంత పార్టీ నాయకులను, కార్యకర్తలను చులకన చేసి మాట్లాడే నైజం పవన్‌ది. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అది కూడా బలంగా ఉన్న స్థానాలలో కాకుండా బలహీనంగా ఉన్నటువంటి స్థానాలలో కేవలం 24 సీట్లను సొంతం చేసుకోవటం ఆయన రాజకీయ పరిపక్వతను చాటి చెబుతోంది. అయితే తానొక్కడినే పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నానన్న అహంకారం తనలో ఎక్కువగా ఉందని, అదే తన రాజకీయ భవిష్యత్తుకు అడ్డుగా మారుతుందనే విషయాన్ని పవన్ గ్రహించాల్సి ఉందని పలువురు ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.