YouTube channel subscription banner header

18 ఓటీటీలను బ్యాన్ చేసిన కేంద్రం.. ఎందుకంటే!

Published on

దేశవ్యాప్తంగా 18 OTT ఫ్లాట్‌ఫామ్స్‌ను కేంద్రం నిలిపేసింది. ఆయా ఓటీటీల్లో అసభ్య కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. దీంతోపాటు 19 వెబ్‌సైట్‌లు, 18 యాప్‌లను తొలగించింది. 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా నిలిపేసింది. ‘సృజనాత్మక వ్యక్తీకరణ’ ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని కేంద్రం పలుమర్లు హెచ్చరించింది. అయినా కొన్ని ఓటీటీలు పట్టించుకోలేదు. దాంతో 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తాజాగా తొలగించింది కేంద్రం.

బ్యాన్‌ అయిన ఓటీటీల లిస్ట్ ఇదే:
X Prime, Hot Shots VIP, Uncut Adda, MoodX, Prime Play, Voovi, Besharams, Mojflix, Dreams Films, Neon X VIP, Yessma, Hunters, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, Nuefliks.

ఈ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం అవుతున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం అశ్లీలతే ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వీటివల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్‌లను కొన్ని కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుతున్నట్లు కేంద్రం వివరించింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్‌ భారత్‌లో బ్యాన్‌ అయ్యాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...