YouTube channel subscription banner header

చంద్రబాబు కుటిల ఎత్తుగడలు.. పురంధేశ్వరికి బీజేపీ పెద్దల పిలుపు

Published on

సీట్ల పంపకంలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ పట్ల అనుసరిస్తున్న కుటిల ఎత్తుగడలపై బీజేపీ అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఆ విషయంపై చర్చించడానికి బీజేపీ పెద్దల నుంచి పార్టీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి పిలుపు వచ్చింది. దీంతో ఆమె హుటాహుటిన హస్తిన బయలుదేరి వెళ్లారు.

టీడీపీ ఏనాడు గెలువని సీట్లను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు తమకు కట్టబెడుతున్నారని, అందులోనూ టీడీపీని వదిలి బీజేపీలో చేరినవారికి టికెట్లు ఇచ్చేలా వ్యూహం రచించారని రాష్ట్ర బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర పార్టీ సీనియర్‌ నేతలు కొంత మంది శివప్రకాష్‌ జీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై 16 మంది బీజేపీ సీనియర్‌ నాయకులు పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు కూడా లేఖ రాశారు.

పాడేరు, అనపర్తి, ఆదోనీలతో పాటు మరికొన్ని సీట్లపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయాలన్నింటి మీద చర్చించడానికి పురంధేశ్వరిని హస్తినకు పిలిపించినట్లు సమాచారం. ఈ నెల 21వ తేదీలోపు బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు లోక్‌సభ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు దక్కాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...