YouTube channel subscription banner header

జయప్రకాశ్‌ నారాయణ‌కి జాండీస్‌ వచ్చింది..!?

Published on

భలే దరిద్రంగా ఉంటాయి కదా రాజకీయాలు..! నరేంద్ర మోదీని విమర్శించి, తిట్లతో చెలరేగిపోయిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీ తోకపట్టుకుని గోదావరి ఈదుతున్నాడు. అచ్చూ అలాగే చంద్రబాబుని తీవ్రంగా విమర్శించి, ఘోరంగా తిట్టిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జయప్రకాశ్ నారాయణ చివ‌రికి ఆయ‌న‌ జట్టులో చేరిపోయారు. నరేంద్ర మోదీయే ప్రజా రక్షకుడు అని చంద్రబాబు అంటుంటే చంద్రబాబు నాయుడే కరెక్ట్‌ అని జయప్రకాశ్‌ తాళం వేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా ఉండే రౌడీషీటర్లు, గూండాలు, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా గాళ్లు పార్టీలు మారడం, ఏ ఎండకాగొడుగు పట్టడం సహజం. కానీ, మేధావిగా పేరుపొంది, ప్రజల పక్షాన నిలబడే మనిషిగా పరువు ప్రతిష్టలున్న బాగా చదువుకున్న జయప్రకాశ్, ప్లేటు ఫిరాయించడం విచిత్రంగా ఉంది.

లోక్‌సత్తా పెట్టి, దాన్ని రాజకీయ పార్టీగా మార్చి, ప్రజావాణిని వినిపించి ఎన్నికల్లో పోటీ చేసిన పెద్ద మనిషి హఠాత్తుగా చంద్రబాబు భజన బృందంలో చేరిపోవడం జనాన్ని షాక్‌కు గురి చేసింది. అయితే, ఇందులో అంత ఆశ్చర్యపోవడానికేమీలేదు. ఒకనాటి తూర్పుగోదావరి కలెక్టర్, సమర్థుడైన అధికారి అయిన జయప్రకాశ్‌ని ఏరికోరి ఎంపిక చేసుకున్నాడు ‘ఈనాడు’ రామోజీరావు. ఆనాడు ఎన్టీ రామారావులాగా, చంద్రబాబు కూడా ఎదురు తిరిగితే, మనవాడొకణ్ణి సిద్ధంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో జయప్రకాశ్‌ని ప్రమోట్‌ చేశారు. ప్రతిరోజూ, అయిన దానికీ కానిదానికీ ఈనాడులో జయప్రకాశ్‌ వార్త వేసి, ఫొటో వేసి ప్రచారం హోరెత్తించారు. అయినా ఆయన ప్రజా నాయకుడిగా నిలదొక్కుకోలేకపోయాడు. అది పక్కనబెడితే, అసలు కీలకం ఏమిటంటే.. కులం! రామోజీ, చంద్రబాబు, జయప్రకాశ్‌ ఒకే కులానికి చెందినవాళ్లని తెలుసుకోగలగాలి. చంద్రబాబుని జయప్రకాశ్‌ పొగడడం వెనక రామోజీ ప్రయోజనాలున్నాయని గమనించాలి. బీజేపీతో రామోజీకి గట్టి సంబంధాలు ఉన్నాయనే నిజాన్ని గ్రహించగలగాలి. అది తెలిస్తే, జయప్రకాశ్ నారాయణ నిస్సిగ్గుగా లొంగిపోవడంలోని ఆంతర్యం ఈజీగా అర్థం అయిపోతుంది.

విద్యారంగానికీ, వైద్య రంగానికీ జగన్మోహన్‌రెడ్డి చేసిన సేవలు, కృషీ ఎంతో గొప్పవని కొనియాడిన మనిషి, ఆ నోటితోనే ఇప్పుడు జగన్ని విమర్శిస్తున్నాడు. దిగజారడం అంటే ఇదే. కుల ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించడం అన్నా ఇదే..! ప్రముఖ జర్నలిస్ట్, ఏలూరు ‘హిందు’ విలేకరిగా అనేక సంవత్సరాలు పనిచేసిన చిత్తూరు జిల్లాకు చెందిన గాలి నాగరాజు(కమ్మ) జయప్రకాశ్‌ని తీవ్రంగా విమర్శిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. ఆయన ప్రవర్తనలో మార్పు, పార్టీ మార్పు, చంద్రబాబుకి వంతపాడడం ఆశ్చర్యంగా ఉందని నాగరాజు ఆగ్రహం వ్య‌క్తం చేశారు.

జయప్రకాశ్‌ ఫోర్స్‌ అంతా చూస్తే, జగన్‌ని చూసి వీళ్లంతా భయంతో వణుకుతున్నారని అర్థమవుతుంది. ఎలాగైనా, ఏం చేసన్నా జగన్‌ని గద్దె దింపాలన్న కక్షతోనే ఇదంతా జరుగుతోంది, బీజేపీకి, టీడీపీకి పడదు. జనసేనకి తెలుగుదేశంకీ కుదరదు. జయప్రకాశ్‌కి బీజేపీ అంటే చిరాకు. అయినా, ఒక అపవిత్ర కలయిక తప్పదు. ఈ మాత్రం అర్థం చేసుకోలేని వెర్రివాళ్లుకారు జనం. మిడిసిపడుతున్న కూటమి వ్యూహం బెడిసికొడుతుందేమో..! జయప్రకాశ్ నారాయణ దురాశ, చివరికి దుష్ఫలితాన్నే ఇస్తుందేమో..!

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...