టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శల వర్షం కురిపించారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జెండా మోయడమే పవన్ కల్యాణ్ అజెండా అని వెలంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ కోసమే పవన్ ఎదురుచూస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ఆయన్ని ప్రజలెవరూ నమ్మరని ఆయన జోస్యం చెప్పారు. . ఇంటెలిజెన్స్ మాజీ డీజీ వెంకటేశ్వరరావు ద్వారా పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకున్నాడని, పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.
సీఎం జగన్ పోలీసు వ్యవస్థని నియంత్రణ చేసుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పాదయాత్ర, బస్సు యాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. .సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 10 శాతం కూడా చంద్రబాబు ఏనాడు చేయలేదని భావించారు.
విజయవాడలో బొండా ఉమా ఆటలు ఇక సాగవు…
విజయవాడలో బొండా ఉమా ఆటలు ఇక సాగవన్నారు. ఉమా చేసిన దందాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయని ఆయన అన్నారు. విదేశాలకు వెళ్లి పేకాట, క్యాసినో ఆడే ఉమాకు అభివృద్ధి గురించి ఏం తెలుసని విమర్శించారు. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా పోరాటం చేశాడా..? అని ప్రశ్నించారు.ఇక బొండా ఉమా కొడుకులు బైక్ రేసుల్లో అమాయకులైన విద్యార్థులను చంపేశారని ఆయన ఆరోపించారు. మరి..వెలంపల్లి శ్రీనివాస్ విమర్శలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బొండా ఉమా స్పందిస్తే ఏమి చెబుతారో చూడాలి.