YouTube channel subscription banner header

బాలయ్యకు పరిపూర్ణానంద స్వామి సెగ.. విజయంపై ప్రభావం చూపేనా?

Published on

హిందూపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున నందమూరి బాలకృష్ణ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. గత రెండు సార్లు జరిగిన ఎన్నికలలో కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా బాలయ్య పోటీ చేసి అఖండ విజయం సాధించారు. అయితే ఈసారి కూడా హిందూపురం నియోజకవర్గంలో బాలకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు అయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేయబోతున్నారన్న విషయంపై ఆత్రుత నెలకొంది.

హిందూపురం పార్లమెంట్ స్థానం నుంచి పరిపూర్ణానంద స్వామి టికెట్ ఆశించారు. తప్పకుండా టికెట్ తనకే వస్తుందని పరిపూర్ణానంద స్వామి ఆశించారు కానీ ఆ టికెట్ మాత్రం టీడీపీ తరఫున అంబికా లక్ష్మీనారాయణకు చంద్రబాబు కేటాయించారు. ఈ విధంగా ఎంపీగా అంబికా లక్ష్మీనారాయణకు టికెట్ ఇవ్వడంతో పరిపూర్ణానంద స్వామి ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ.. నాకు హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా టికెట్ రాకపోవడానికి బాలయ్య కారణమంటూ ఆయ‌న‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్థానికుడు కాదంటూ తనకు టికెట్ ఇవ్వకుండా చేశారని తెలిపారు. మరి బాలకృష్ణ స్థానికుడా మంగళగిరిలో పోటీ చేస్తున్నటువంటి బాలయ్య అల్లుడు లోకేష్ స్థానికుడా అంటూ ఈయన ప్రశ్నించారు.

పార్టీ కోసం కొన్నిసార్లు త్యాగాలు చేయాలి అంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. అయితే ఇలాంటి త్యాగాలు కేవలం మాలాంటి వాళ్ళు మాత్రమే చేయాలా, చంద్రబాబు కుటుంబ సభ్యులు చేయకూడదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు కుటుంబంలో ఆయన కుమారుడు, బావమరిది, కొడుకు తోడల్లుడు కూడా ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఇక జనసేన నుంచి ఎక్కువగా కూడా టీడీపీకి మద్దతుగా ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నారు. బీజేపీ నుంచి కూడా టీడీపీకి మద్దతుగా ఉన్న వారికి టికెట్లను కేటాయించారు.

తాను హిందూపురం నియోజకవర్గంలో వివిధ సంఘాల వారితో కలిసి దాదాపు 5వేల మందిని తయారు చేశానని, వారందరూ నా విజయానికి దోహదం చేస్తారంటూ పరిపూర్ణానంద స్వామి తెలిపారు. ఇక తాను ఎంపీగా మాత్రమే కాకుండా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తానని తెలిపారు అయితే హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి గెలుస్తారా లేదా అన్నది ముఖ్యం కాదు కానీ ఈయన కారణంగా బాలయ్యకు పడే ఓట్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...