YouTube channel subscription banner header

జగన్ విజన్‌కి విద్యా సంస్క‌ర‌ణ‌లే నిదర్శనం!

Published on

ఇప్పటివరకు ఏ ప్రభుత్వం పిల్లలకు చేయలేనటువంటి మంచిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని చెప్పాలి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పిల్లలకు ఓట్లు లేవు కదా వారికి మంచి చేస్తే మ‌న‌కి ఏమొస్తుంది అనుకున్నాయి. కానీ నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడి జగన్మోహన్ రెడ్డి మాత్రమే గుర్తించారు. అందుకే పిల్లల బంగారు భ‌విత‌ కోసం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. విద్య‌పై ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయిని సామాజిక పెట్టుబడిగా చూశారు.

జ‌గ‌న్ అధికారం చేప‌ట్టిన త‌రువాత విద్య రంగంలో ఎన్నో మార్పులు చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం చిన్నపిల్లల మొదలు విదేశీ విద్య‌ను అభ్య‌సించే విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలకు శ్రీ‌కారం చుట్టారు. మధ్యాహ్నం భోజనం పథకం, జ‌గ‌న‌న్న అమ్మబడి, జగనన్న విద్యా కానుక, జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన వంటి స్కీమ్స్‌ను అమ‌లు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విద్యను ప్రైవేటీకరణ చేశారు. కేవలం తనకు అనుకూలంగా ఉన్న చైతన్య, నారాయణ విద్యాసంస్థలను లాభాల బాటలో నడిపించడం కోసమే చంద్రబాబు నాయుడు వారికి ఊడిగం చేశారు. కానీ జగనన్న అలా చేయలేదు. పిల్ల‌ల‌కు మ‌నం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చ‌దువు అని న‌మ్మి.. పేద పిల్లల చదువు కోసం విద్యా రంగంలో వినూత్న సంస్క‌ర‌ణ‌లు తీసుకొచ్చారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో చ‌దివే పిల్ల‌ల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు రూ.వేల కోట్లు ఖర్చు చేశారు. స‌ర్కారు బ‌డుల‌ను కార్పొరేట్ పాఠ‌శాల‌ల‌కు ధీటుగా తీర్చిదిద్దారు. 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం చదువులను ప్రవేశపెట్టారు.

గిరిజన విద్యా సంస్థలను జగన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వారి భోజన, ఇతర సదుపాయాల కోసం రూ.920.31 కోట్లు ఖర్చు చేసింది. పాఠశాలలను జగన్‌ ప్రభుత్వం ఆధునికీకరించింది. వాటిలో 1,55,599 మంది విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...