ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా నవరత్నాలను ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి వివిధ రకాల సంక్షేమ పథకాలను అందించారు. అయితే ఈయన సంక్షేమ పథకాలను అందించడంతో ప్రతిపక్ష నేతలు ఈయన పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ప్రజల సొమ్ము ప్రజలకే ఇస్తున్నారని ఇలా ఉచితంగా సంక్షేమ పథకాలను ఇస్తూ రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.
చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు రామోజీరావు, రాధాకృష్ణ వంటి వారు వత్తాసు పలుకుతూ వార్తలను కూడా రాశారు. ఇలా సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్ల కాలంలో ప్రజలకు 52 వేల 700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఒక వేళ చంద్రబాబు అధికారంలోకి వస్తే జగన్ అమలు చేస్తున్న పథకాలను రద్దు చేయడం కుదరుదు.
ఇలా సంక్షేమానికి అలవాటు పడినటువంటి ప్రజలకు ఈ సంక్షేమ పథకాలను రద్దు చేస్తే ఓట్లు వేయరు కనుక చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కూడా ఈ సంక్షేమ పథకాలను తప్పనిసరిగా అమలు చేయాల్సిందే అయితే జగన్ అమ్మఒడి ఒకరికే ఇవ్వగా ఈయన ఇద్దరికీ ఇస్తానని చెబుతున్నారు. అలాగే 18 సంవత్సరాల నిండిన వారందరికీ ప్రతి నెల డబ్బులు పంచడం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, పింఛన్ 4000 చేయడం లాంటి హామీలను ఇస్తున్నారు. చంద్రబాబు చెప్పిన ఈ హామీలు నెరవేర్చాలంటే ఆయనపై మరింత భారం పెరుగుతుంది.
చంద్రబాబు తాజాగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడానికి ఏడాదికి 73,440 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే జగన్ చేస్తున్న పథకాల కంటే ఎక్కువ డబ్బు చంద్రబాబు నాయుడు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రకటించిన ఈ సూపర్ సిక్స్ పథకాలకు అయ్యే ఖర్చు మొత్తం రూ.1.4 లక్షల కోట్లు అవుతుందని తెలుస్తుంది.
ఆ మొత్తాన్ని చంద్రబాబు ఎలా సేకరించుకుంటారనే ప్రశ్న. జగన్ ప్రజలకు ఉచిత సంక్షేమ పథకాలను అందించి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చారని చంద్రబాబు విమర్శ చేశారు. మరి ఆయన కంటే ఎక్కువ మొత్తంలో సంక్షేమ పథకాలను అందిస్తానని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తారా అన్న ప్రశ్న ప్రతి ఒక్క సామాన్యులకు కలుగుతుంది. సంక్షేమ పథకాలకు బాబు నిధులు ఎలా సమకూరుస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.