ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నాయుడు అమలు చేయలేదు. హజ్ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటల్లో హజ్ హౌస్‌లు కట్టి ఇస్తానని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఆయన అటకెక్కించారు