టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తన గెలుపు కోసం నానా హడావిడి చేస్తూ ఉంటారు. అందుకోసం ప్రజలపై హామీల వర్షం కురిపిస్తుంటారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను మరిచిపోతూ ఉంటారు. ఇలా గతంలో ఈయనను నమ్మి అధికారం కట్టబెట్టడంతో ఆంధ్ర ప్రజలను నట్టేట ముంచారు. తన ప్రభుత్వం అధికారంలోకి వస్తే అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పే బాబు కేవలం మాటలకే పరిమితమవుతారని అందరికీ తెలిసిందే.
గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అరకొరక హామీలను నెరవేర్చారు. అధికారం నుంచి దిగిపోయేనాటికి పెద్ద ఎత్తున బకాయిలను పెట్టారు. ఆలా చంద్రబాబు పెట్టిన బకాయిలను వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెల్లించారు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులకు చెందిన 56,194 జంటలకు వైస్సార్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కింద జగన్ ప్రభుత్వం రూ.427.27 కోట్లు అందించింది. అయితే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దుల్హన్ పథకం కింద ముస్లిం మైనారిటీలకు అందించిన సాయం అరకొర మాత్రమే. 2018లో ఎన్నికలకు ముందు హడావిడిగా రూ.25 వేల సాయాన్ని రూ.50 పెంచినట్టు చెప్పారే కానీ ఆ డబ్బును మాత్రం లబ్ధిదారుల ఖాతాలోకి వేయలేదు. ఇలా చంద్రబాబు సుమారు 177.96 కోట్ల రూపాయలు బకాయిపెట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బకాయిలను విడుదల చేశారు.