YouTube channel subscription banner header

పవన్ కల్యాణ్ గురించి ఇంత కన్నా బాగా ఎవరు చెప్పగలరు?

Published on

జనసేనలో కీలక బాధ్యతలు నిర్వహించిన పోతిన మహేష్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పవన్ కల్యాణ్‌కు అన్ని విధాలుగా తోడుగా ఉంటూ పార్టీ విస్తరణ కోసం అహర్నిశలు పనిచేశారు. అసెంబ్లీ సీటు ఇస్తానని చెప్పి ఆయనను పవన్ కల్యాణ్ నిండా ముంచేశాడు. ఆయన విజయవాడ వెస్ట్ సీటు ఆశించారు. కానీ చివరకు ఆయనకు దక్కింది నిండు సున్నా. పార్టీకి రాజీనామా చేసిన సందర్భంగా పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. తన మాటల ద్వారా పవన్ కల్యాణ్ నిజస్వరూపాన్ని ఆయన బయటపెట్టారు. మహేష్ మాట్లాడిన విషయాల్లోని ముఖ్యాంశాలను చూద్దాం.

– భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవాడు నాయకుడు కాలేడు.
– కొత్త తరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం.
– పవన్ కల్యాణ్ మార్పు తెస్తాడని నమ్మాం.
– 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచినా 2024పై ఆశలు పెట్టుకున్నాం.
– జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది.
– పవన్ కల్యాణ్ నిజస్వరూపం అందరూ తెలుసుకోవాలి.
– మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టి విచ్చి చూడ పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్.
– పార్టీ నిర్మాణంపై, క్యాడర్ పై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టలేదు.
– స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్లు ప్రయాణం చేసినందుకు మా మీద మాకే అసహ్యం వేస్తోంది.
– అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం
– ప్రజలు జనసైనికుల కన్నా తెలివైనవారు.
– పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావడం లేదని అనుకున్నాం.
– ఎంత చెప్పినా జనసేనపై ప్రజలకు విశ్వాసం కుదరలేదు.
– 25 కేజీల బియ్యం కాదు… 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కల్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేపోయారు.
– 25 రోజుల తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటో చెప్పగలరా?
– 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకు ఏం భవిష్యత్తు ఇవ్వగలరు?
– పవన్ కల్యాణ్ స్వార్థానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి.
– పార్టీలో పవన్ కల్యాణ్ కు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం. కానీ అన్నీ పవన్ కల్యాణ్ కు తెలిసే జరుగుతున్నాయి.
– పవన్ కల్యాణ్ చూపులో ద్వంద్వ‌ అర్థాలున్నాయి.
– సీట్లన్నీ టీడీపీ నాయకులకే కేటాయించారు.
– గెలిచే నలుగురు ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ కోసం నిలబడుతారా?
– పవన్ కల్యాణ్ పార్టీని పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే.
– అన్ని ఆధారాలు బయటపెడుతా.
– కాపు యువతను బలి చేయవద్దని కోరుతున్నా.
– మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే పవన్ కల్యాణ్ ఆస్తులు కొనుక్కున్నారు.
– మా రక్తమాంసాలపై పవన్ కల్యాణ్ భవంతులు కట్టుకున్నారు.
– కాకినాడు మేయర్ సరోజ, శేషకుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు.
– పవన్ కల్యాణ్ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయటపెడుతారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు.
– విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి గతంలో బినామీ చానెల్ లో పవన్ కల్యాణ్ తల్లిని దూషించారు.
– అలాంటి సుజనా చౌదరికి పవన్ కల్యాణ్ టికెట్ ఎలా ఇప్పిస్తారు?
– కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మరిచిపోయారా?
– విజయవాడలో ఇప్పుడు జనసేన లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు.
– మేం బతికించిన పార్టీని పవన్ కల్యాణ్ చంపేశారు.
– టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకు వద్దన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు?
– పొత్తు ధర్మం టీడీపీ, బీజేపీలకు ఉండొద్దా, జనసేనకే ఉండాలా?
– పొత్తు కుదిర్చి పెడితే ఎక్కువ సీట్లు అడగాలి కదా… ఎక్కువ సీట్లు సాధించాలి కదా
– కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుంచి ఒక్క కాపు నాయకుడు కూడా దొరకలేదా?
– కసాయివాడికి కనికరం ఉంటుంది… విధేయతతో ఉన్నందుకు పవన్ కల్యాణ్ కు కనికరం కూడా లేదు.
– 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు, ఒక ఎంపీ స్థానం మాత్రమే జనసేన కోసం పనిచేసినవారికి ఇచ్చారు.
– టీడీపీ నుంచి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే పవన్ కల్యాణ్ అడ్డుకోగలరా?
– వచ్చే 12 నెలల్లో జనసేన అడ్రస్ గల్లంతవుతుంది.
– జనసేన ప్రజారాజ్యం – 2 అవుతుంది.
– త్యాగాలకు బీసీలే కావాలా, కమ్మవారు త్యాగాలకు పనికి రారా?
– మంగళగిరి, విజయవాడ వెస్ట్ బీసీల నుంచి తీసుకుని కమ్మవారికి ఇవ్వలేదా?
– విజయవాడ వెస్ట్ సీటు బలహీనవర్గాల్లో ముస్లింలకో, సోము వీర్రాజువంటివారికో ఇవ్వొచ్చు కదా…
– పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు?
– పద్మశాలిలకు ఒక్క సీటు కూడా ఎందుకు కేటాయించలేదు?
– పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు.
– రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు.
– ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి మరో పార్టీ అధ్యక్షుడి కాళ్లు పట్టుకుంటున్నారు.
– అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు?
– అనకాపల్లిలో నాగబాబు వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తల నుంచి నిధులు వసూలు చేశారు.
– వాళ్లు ఫిర్యాదు చేయాలని అనుకున్నారు. అందుకే అక్కడి నుంచి వచ్చేశారు.
– నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సును ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలు ముక్కలు చేశారు.
– నేను చెప్పేవన్నీ నిజాలే… నాకు దేనికీ భయం లేదు.
– చివరగా నాకు ఒకే ఒక కోరిక… పిఠాపురంలో పవన్ కల్యాణ్ తన ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...