ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి మాత్రమే కాకుండా వారి రాజకీయ ప్రాతినిధ్యం పెంచడానికి కూడా చర్యలు చేపట్టారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాత్రం వారిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇచ్చిన హామీలను కూడా ఆయన సరిగా అమలు చేయలేదు.
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో మైనారిటీల కోసం రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కానీ జగన్ ప్రభుత్వం రూ.24,304 కోట్ల మేర సంక్షేమ పథకాలను అందించింది. ముస్లింలకు మైనారటీలకు జగన్ డీబీటీ పద్ధతిలో రూ.13,239 కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా రూ.11,065 కోట్లు అందించారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మౌజమ్ లకు రూ.3 వేల వేతనం ఇస్తే దాన్ని జగన్ ప్రభుత్వం రూ.5 వేలకు పెంచింది. ఇమామ్ లకు చంద్రబాబు రూ.5 వేల వేతనం ఇస్తే జగన్ దాన్ని రూ.10 వేలకు పెంచారు.
ముస్లింలకు వైఎస్ రాజశేఖర రెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వల్ల ముస్లిం యువతీయువకులు వేలాది మంది ఉన్నత విద్యను ఆర్జించి వైద్యులుగా, ఇంజినీర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. సామాజికంగా ప్రగతి సాధించారు. సామాజిక హోదాను పెంచుకున్నారు.
ఎన్నికలకు ముందు కంటితుడుపు చర్యగా ముస్లిం నేతకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. అందుకు విరుద్ధంగా ముస్లింల ప్రాతినిధ్యాన్ని రాజకీయాల్లోనూ ప్రభుత్వంలోనూ పెంచడానికి జగన్ చర్యలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు జగన్ 5 ఆసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ముస్లిం మైనారిటీలకు 4 ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఇచ్చారు.
ముస్లిం మైనారిటీ నేతకు జగన్ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. వైఎస్సార్ సీపీ తరఫున నలుగురేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహించారు. జగన్ 12 మంది ముస్లిం మైనారిటీ నేతలను కార్పోరేషన్ చైర్మన్లుగా చేశారు. ముస్లిం మైనారిటీలను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా, ఆర్టీఐ కమిషనర్గా నియమించారు.
ఈసారి ముస్లిం మైనారిటీల ప్రాతినిధ్యాన్ని మరింతగా పెంచేందుకు జగన్ సిద్ధపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సీట్లు ముస్లిం మైనారిటీలకు ఇచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున ముగ్గురికి మాత్రమే అసెంబ్లీ సీట్లు దక్కాయి.