తెలంగాణలో కాంగ్రెస్-MIM కలిసిపోయాయంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయం స్పందించారు MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు లేదన్నారు. ఒంటరిగానే పోటీ చేస్తున్నామని స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ నాయకురాలు అనుప్రియా పటేల్‌తో కలిసి పోటీ చేస్తున్నామని, తమిళనాడులో AIDMKతో జతకట్టామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో పొత్తులపై అక్కడి MIM నేతలు చర్చలు జరుపుతున్నారని స్పష్టం చేశారు అసద్.
బోగస్ ఓట్లతో MIM గెలుస్తుందన్న బీజేపీ అభ్యర్థి మాధవీలత ఆరోపణలపైనా స్పందించారు అసదుద్దీన్. మాధవీలత ఆరోపణలు ఎన్నికల కమిషన్‌ను అవమానపరిచినట్లేనన్నారు. హైదరాబాద్‌లో వెనుకబడిన వర్గాల వారు, దళితులు, క్రైస్తవులు ఓటును వినియోగించుకుంటారని, బోగస్ ఓట్లంటే వారిని అవమానపరచడమేనన్నారు.