ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై జరిగిన దాడి విషయంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరి బెడిసికొట్టింది. జరిగిన దాడిని తక్కువ చేయాలని, జగన్ను చులకన చేయాలని, దాన్ని జగన్ మీదికే నెట్టాలని ప్రయత్నించి.. తన పరువు తానే తీసుకుంది టీడీపీ.