అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలా పడిన కేడర్‌ను ఉత్తేజపరిచేందుకు సిద్ధమయ్యారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. ఇందులో భాగంగా త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ యాత్ర దాదాపు రెండు నుంచి మూడు వారాల పాటు కొనసాగుతుందని సమాచారం.
గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన కేసీఆర్..బస్సు యాత్రపైనా నేతలతో చర్చించారు. ఏప్రిల్ 22 నుంచి బస్సు యాత్ర ప్రారంభించాలని పలువురు నేతలు సూచించినట్లు సమాచారం. అయితే యాత్ర ప్రారంభించాల్సిన తేదీపై ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.
ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 లేదా 4 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర కొనసాగేలా ప్లాన్ చేస్తున్నారు. యాత్రలో భాగంగా రైతులను పరామర్శించి..పంట పోలాలను సందర్శించనున్నారు. దాంతో పాటు రోడ్ షోలలో కూడా కేసీఆర్ పాల్గొంటారు.