YouTube channel subscription banner header

ఒంటి కన్ను రాక్షసుడు.. రామోజీ బుర్ర నిండా చెత్తనే

Published on

రామోజీరావు ఈనాడులో కంపరం పుట్టే రాతలు రాయిస్తున్నారు. ఆయన బుర్ర నిండా చెత్త చేరింది. అది టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి చెత్త. ‘అన్నా.. సున్నా అంటే అంత భారమా?’ అనే శీర్షికతో కట్టుకథను ఒకటి ఈనాడులో ప్రచురించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఘోరాలను ఆయన చూడలేక ఒంటి కన్ను రాక్షుసుడిగా ఆయన మారిపోయారు. 2014 ఎన్నికలకు ముందు పొదుపు సంఘాల రుణాలను మొత్తం మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు.

పొదుపు సంఘాల రుణాలను చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయకపోవడమే కాకుండా సున్నా వడ్డీ పథకాన్ని ఆపేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పెట్టిన బాకీలను తీర్చడమే కాకుండా ఆ పథకాన్ని పునరుద్ధరించారు. చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దడంతో పొదుపు సంఘాలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు పోటీ పడుతున్నాయి. పొదుపు సంఘాలకు ఇచ్చే రుణాల్లో నాలుగు శాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని అబద్ధానికి షుగర్ కోటింగ్ ఇచ్చి ఆయన వ్యాఖ్యానించారు.

ఈనాడు వార్తా కథనం మొత్తం తప్పుల తడక. రిజర్వ్ బ్యాంక్ 2022 జులై 20న జారీ చేసిన ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏడు శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ రుణాలపై కేంద్ర ప్రభుత్వం ఏడు శాతం వడ్డీ రాయితీ ఇస్తుందనే ఈనాడు రాసిన రాతలో ఏ మాత్రం నిజం లేదు. ఏడు శాతం వడ్డీని జగన్ ప్రభుత్వమే భరిస్తోంది.

చంద్రబాబు నాయుడు గతంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని తుంగలో తొక్కారు. చంద్రబాబు మాటను నమ్మి ప్రతి ఐదులో ఒక పొదుపు సంఘం తమ రుణాలను బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో బ్యాంకులు వారిపై ఎగవేతదారుల ముద్ర వేసింది. పొదుపు సంఘాలకు వైఎస్సార్ ఆసరా పథకం కింద జగన్ ప్రభుత్వం 2019 నాటికి ఉన్న అప్పులను చెల్లించింది. దాంతో మహిళలు దాదాపు 99.98 శాతం మంది ఎప్పటికప్పుడు వాయిదాలను చెల్లిస్తున్నారు.

2019 ఏప్రిల్ నుంచి 2024 వరకు ఐదేళ్ల కాలంలో 1.73 లక్షల కోట్లు బ్యాంకులు పొదుపు సంఘాలకు రుణాలుగా ఇచ్చాయి. దీన్ని బట్టి పొదుపు సంఘాల విశ్వసనీయత జగన్ ప్రభుత్వం వల్ల ఎంతగా బ్యాంకుల వద్ద పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగేళ్లలో వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద పొదుపు సంఘాల రుణాలపై వడ్డీ రూ.4969.05 కోట్లను ఇప్పటికే చెల్లించింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...