YouTube channel subscription banner header

అసలు విజన్ లేనిదే ఆయనకు..

Published on

చంద్రబాబు విజనరీ అని ఎల్లో మీడియా ఊదరగొట్టడం మనందరికీ తెలిసిందే. విజన్ 2020, విజన్ 2050.. ఇలా ఎల్లో మీడియా జాకీలేసి మరీ బాబుకి ఓ రేంజ్‌లో హైప్ ఇస్తోంది. అసలు చంద్రబాబుకి నిజంగానే విజన్ ఉంటే.. ఆయన పాలనలో అద్భుతాలు జరిగి ఉండాలి కదా? ఆయన 14 ఏళ్ల పాలనలో మనందరి జీవితాలు అద్భుతంగా మారిపోయి ఉండాలి కదా..? అలా జరగలేదంటే బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసింది శూన్యం అనే చెప్పాలి.

బాబు చెత్త విజన్ వల్లే తెలుగు ప్రజలకు ఈ కష్టాలన్నీ అని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు దృష్టి కేవలం హైదరాబాద్‌పైనే ఉంది. దాని వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో నగరం ఏదీ అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రజలు దీనివల్ల చాలా నష్టపోయారు. హైదరాబాద్‌లేని ఏపీని ఐదేళ్లుగా మరింత అంధకారంలోకి నెట్టేశారు చంద్రబాబు. తొలి ముఖ్యమంత్రిగా ఎంతో చేయాల్సి ఉన్నా.. ఏమీ చేయలేక చేతులెత్తేశారు, ఇప్పుడు జగన్‌పై పడి ఏడుస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హైదరాబాద్‌తోపాటు మిగతా నగరాల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందుకే వరంగల్, కరీంనగర్ వంటి ప్రాంతాలు ఐటీ విస్తరణకు ఉపయోగపడ్డాయి. టైర్-2 సిటీస్‌లో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లో మిగతా ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు కేసీఆర్. కానీ ఏపీలో తొలి ముఖ్యమంత్రిగా కూడా క్రెడిట్ కొట్టేసిన చంద్రబాబు నూతన రాష్ట్రాన్ని అన్నిరంగాల్లోనూ మరింతగా దిగజార్చారు.

ఇతర రాష్ట్రాల్లో ఎలా..?
తమిళనాడు అభివృద్ధి అంతా కేవలం చెన్నైలోనే కేంద్రీకృతమై లేదు. కోయంబత్తూరు, సేలం.. ఇలా దాదాపు ఏడెనిమిది పట్టణాలు చెన్నైకి ప్రత్యామ్నాయంగా ఉన్నాయి. కర్నాటకలో బెంగళూరుకి ధీటుగా ఉంటుంది మైసూర్. దాదాపు 5 పట్టణాలు రాజధానితో పోటీ పడుతుంటాయి. మహారాష్ట్రలో కేవలం ముంబై మాత్రమే కాదు పూణె, నాగ‌పూర్ కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి, ఉపాధికి నిలయాలుగా ఉన్నాయి. మరి ఏపీ పరిస్థితి ఏంటి..? ఏపీలో ఐదేళ్లుగా అమరావతి అనే ఊహాజనిత రాజధానిని కూడా అభివృద్ధి చేయలేకపోయారు చంద్రబాబు. జగన్ వచ్చాక విశాఖపై ఫోకస్ పెంచితే మాత్రం గోలగోల చేస్తున్నారు. విశాఖే కాదు.. ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనేది సీఎం జగన్ ఆలోచన. దాని కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు రాజధానులతోపాటు.. ప్రతి జిల్లా కేంద్రాన్ని కూడా ఉపాధి కేంద్రంగా మార్చబోతున్నారు జగన్. ఇప్పుడు చెప్పండి.. విజన్ లేకపోయినా విజనరీ అని చెప్పుకునే బాబు గొప్పోడా.. విజన్ ఉన్నా కూడా దాన్ని ప్రచారం చేసుకోకుండా కేవలం పనిపైనే దృష్టిపెట్టిన జగన్ గొప్ప నాయకుడా..?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...