YouTube channel subscription banner header

జగన్ కాలిగోటికి పవన్ సరిపోతాడా.. చంద్రబాబూ…

Published on

ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మతిలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అడ్డగోలుగా విరుచుకుపడుతున్నారు. ఓట్ల కోసం జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఆకాశానికి ఎత్తుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన జగన్ మీద అడ్డమైన వ్యాఖ్య ఒకటి చేశారు. పవన్ కాలిగోటికి జగన్ సరిపోడని, పవన్ సినిమాల్లో స్టార్ అని, జగన్‌కు రాజకీయాలు లేకపోతే ఎలా బతుకుతాడని చంద్రబాబు అన్నారు. ఇదేం పోలికనో చంద్రబాబుకే అర్థం కావాలి. జగన్ రాజకీయాలను ఎంచుకున్నారు. పవన్ కల్యాణ్ సినిమాలను ఎంచుకుని రాజకీయాల్లో కూడా కాలు పెట్టారు. కానీ రాజకీయాలను చంద్రబాబుకు తాకట్టుపెట్టారు. పదేళ్ల పార్టీని బలమైన శక్తిగా రూపొందించలేకపోయారు. చంద్రబాబు రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన తన బలం ఆధారపడి రాజకీయాలు చేశారా? వారి రాజకీయ వ్యక్తిత్వాలను ఒక్కసారి చూద్దాం.

చంద్రబాబు మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలు లేకపోతే చంద్రబాబు ఎలా బతుకుతారు? రాజకీయాల కోసమే పవన్ కల్యాణ్‌నూ బీజేపీనీ కాళ్లా వేళ్లా పడి ఆయన చేరువ చేసుకున్నారు. ఆ రాజకీయాలను కూడా ఆయన ప్రజలను నమ్ముకుని చేయలేదు. మోసాలు, దగా, వెన్నుపోట్లతో రాజకీయాల్లో ముందుకు నడుస్తూ వస్తున్నారు. కూతురును ఇచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ నుంచి అధికారాన్ని, పార్టీని లాక్కోవడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణలను వాడుకుని ఆ తర్వాత వదిలేశాడు. వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణను చేరదీసి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్‌ను వదిలేశారు. వీరిద్దరినీ వాడుకున్నంత కాలం వాడుకున్నారు.

తనయుడు నారా లోకేష్ మీద ప్రేమతో, తన వారసత్వాన్ని ఆయనకు కట్టబెట్టాలనే కక్కుర్తితో జూనియర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు దూరం పెట్టారు. ఆయన రాజకీయ జీవితంలో కుట్రలు, మోసాలు, వెన్నుపోట్లు మాత్రమే ఉన్నాయి. ప్రజల విశ్వాసం పొంది అధికారంలోకి వచ్చిన ఉదంతం చంద్రబాబు జీవితంలో లేదు. పొత్తులతో తప్ప ఒక్కడుగా ఎన్నికల్లో పోరాడి టీడీపీని గెలిపించిన ఉదంతం లేదు. అటువంటి చంద్రబాబు రాజకీయాలు లేకపోతే ఎలా బతుకుతారు? పవన్ కల్యాణ్ వల్ల ఆయనకేమైనా సినిమా అవకాశాలు వస్తాయా? ఒక్కరి మీద వ్యాఖ్యలు చేసే ముందు తానేమిటో కూడా తెలుసుకోవాలనే లక్షణం చంద్రబాబులో కొరవడింది. అయినా, పవన్ కల్యాణ్‌తో జగన్‌కు పోలికేమిటి?

పవన్ కల్యాణ్ గురించి చూద్దాం.. ఆయన సినిమాల్లో స్టార్ కావచ్చు. కానీ రాజకీయాల్లో జీరో. రాజకీయాల్లోకి రాకుండా ఉంటే పవన్‌కు కాస్తా గౌరవమైనా ఉండేది. రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఉద్ధరించిందేమిటి? ఒక్క మాట మీద ఎప్పుడైనా నిలబడ్డారా? పదేళ్ల పార్టీని అంగుళం కూడా ముందుకు తీసుకుని వెళ్లలేని అసమర్థుడిగా ఆయన మిగిలారు. చంద్రబాబుకు అమ్ముడుపోయారు. పార్టీని తాకట్టుపెట్టారు. ఈ మాట ఎవరో కాదు, తన ప్రయోజనాన్ని పక్కన పెట్టి జనసేన కోసం అహర్నిశలు పనిచేసిన పోతిన మహేషే అన్నారు. పార్టీ కోసం పనిచేసినవారిని దగా చేసి చంద్రబాబుకు చెందిన నాయకులను తన పార్టీకి కేటాయించిన సీట్లలో పోటీకి దించారు. నమ్మినవారిని మోసం చేయడం బహుశా పవన్ కల్యాణ్ చంద్రబాబు నుంచి నేర్చుకుని ఉంటారు.

పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఒక్క స్థిరమైన, స్పష్టమైన వైఖరితో అడుగుల వేశారా? ఓ సారి చేగువేరా అంటాడు, ఇంకోసారి ఇంకేదో అంటారు. పరస్పర విరుద్ధమైన భావజాలాలతో రాజకీయాలను కలగాపులగం చేసుకున్నారు. పార్టీకి ఒక స్పష్టమైన సిద్ధాంతాన్ని రూపొందించుకుని ప్రజల్లోకి వెళ్లడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. ఆయనకు పార్టీ చంద్రబాబుకో, మరెవరికో తాకట్టు పెట్టడానికి మాత్రమే కావాలి.

పవన్ కల్యాణ్‌కు రాజకీయాలు తాత్కాలిక ప్రయోజనాల కోసం కావాలి. సినిమాలు న‌టించ‌డానికి కావాలి. అందుకే, ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లోకే వెళ్తారు. ప్రజల కోసం రాజకీయాలు చేయరు, చంద్రబాబు కోసం కొంతకాలం రాజకీయాల్లో నటిస్తారు కాబట్టి ఆయన మళ్లీ తన పాత గూటికి చేరుకుంటారు. అందువల్ల రంగులు వేసుకుని మాత్రమే కాకుండా రంగులు వేసుకోకుండా కూడా నటించే పవన్‌తో జగన్‌కు పోలికేమిటనేది చంద్రబాబు చెప్పాలి. పవన్ కల్యాణ్ సినిమాల్లో కూడా అన్నయ్య చిరంజీవి కారణంగా ఎదిగాడు. ఆయనకు చిరంజీవి ఆలంబనగా దొరికారు. అన్నయ్య లేకపోతే తమ్ముడి బతుకు ఏమయ్యేది? ఇంకా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోకి వెళ్లడం మంచిది కాదు కాబట్టి చాలా విషయాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయానికి వద్దాం. విశేషమైన రాజకీయానుభవం ఉందని చెప్పుకునే సీనియర్ నాయకుడు చంద్రబాబు జగన్‌ను ఎదుర్కోవడానికి మూడు చెరువుల నీరు తాగుతున్నారు. దీన్ని బట్టి జగన్ సత్తా ఏమిటో అర్థం కావడం లేదా? జగన్ రాజకీయాలు లేకపోతే ఎలా బతుకుతాడని చంద్రబాబు అడుగుతున్నారు. ఇది ఎంతటి అర్థం లేని ప్రశ్ననో ఇట్లే అర్థమైపోతుంది. జగన్ ప్రజల కోసం చంద్రబాబు కుట్రలను, మోసాలను ఎదుర్కుంటూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. రాజకీయాలే కావాలనుకుంటే సోనియా గాంధీ మాటలను విని ఉంటే ఇంత కష్టపడాల్సిన అవసరం కూడా జగన్‌కు ఉండేది కాదు.

తప్పుడు కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసినా కూడా జగన్ అదరలేదు, బెదరలేదు. సొంత పార్టీని స్థాపించారు. దాన్ని బలోపేతం చేశారు. ఎవరినీ తోడు తెచ్చుకోకుండ‌ చంద్రబాబును ఒంటరిగానే ఎదుర్కుంటున్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన నీరుగారి పోలేదు. ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టారు, దాన్నిబలోపేతం చేశారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును మట్టి కరిపించారు. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమకాలీకుడు అయిన చంద్రబాబు జగన్‌ను ఎదుర్కోలేకపోతున్నారు. దానివల్లనే బోడి గుండుకు మోకాలికి చంద్రబాబు లంకె పెడుతున్నారు, పవన్ కల్యాణ్‌కు జగన్‌కు పోలిక తెస్తున్నారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతూ జగన్ ప్రజా నాయకుడిగా ఎదిగారు.

జగన్ స్థాయిలో చంద్రబాబు తన కుమారుడు నారా లోకేష్‌ను నిలబెట్టగలరా? తన కుమారుడిని ఆయన బలమైన నాయకుడిగా చంద్రబాబు తయారు చేయలేకపోయారు. దొడ్డిదారిన ఆయనను నిలబెట్టాలని చూస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...