ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి.. రాష్ట్రానికి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడడం లేదని టీడీపీ, ఎల్లో మీడియా నిరంతరం ప్రచారం సాగిస్తున్నాయి. నిజానికి ఇందులో ఏ మాత్రం నిజం లేదు. తన ఐదేళ్ల పాలనలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి కన్నా ఎక్కువ పరిశ్రమలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చారు.