వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోని వందకు వంద శాతం అమలుచేశారు. పథకాల అమలులో ఎక్కడా అవినీతి, అక్రమాలకు తావు లేకుండా అర్హులైన లబ్ధిదారులందరికీ వాటిని అందించారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పథకాలను చివరి లబ్ధిదారుడి వరకూ చేర్చారు. పథకాల అమలులో జగన్ సర్కార్‌కు వందకు వంద మార్కులు ఇవ్వడం అతిశయోక్తి కాదు.