వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను చూసి ఏ మాత్రం బెదిరిపోలేదు. వైఎస్ జగన్ తాను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టోనే అందుకు నిదర్శనం. చంద్రబాబు ప్రకటించిన హామీల్లో కొన్ని కొత్త పథకాలు కూడా ఉన్నాయి. కొత్త అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకే. చంద్రబాబు ఆ పథకాలను కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి కాపీ కొట్టారు.