హిందూత్వ ఎజెండాతో మతరాజకీయాలు చేసే బిజెపితో అంటకాగిన టిడిపి అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో మైనారిటీలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన బాబు తప్పుడు వాగ్దానాలతో మరోసారి ముస్లిం మైనారిటీలను మోసపుచ్చే విధానానికి తెరదీశారని పరిశీలకులు అంటున్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే చంద్రబాబు దేశ రాజకీయాల్లోనూ, రాష్ట్ర రాజకీయాల్లోనూ మైనారిటీ వ్యతిరేక వైఖరిని అనుసరించిన సందర్భాలు అనేకం. లౌకికవాదం కన్నా అవకాశవాదమే ఆయన రాజకీయ పంథా.