నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార ర్యాలీతో వార్ వన్ సైడ్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి టికెట్ దక్కని మహిధర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ భరోసానిచ్చారు. దీంతో మహిధర్ రెడ్డి వర్గం ప్రచారంలో మళ్లీ యాక్టివ్ అయింది. అభ్యర్థి సునీల్ కుమార్ బీసీ నేపథ్యం, రెడ్డి సామాజికవర్గ అండ కూడా తోడవడంతో కందుకూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.