రాష్ట్రంలో ముస్లిం సాధికారతకు సీఎం జగన్ పెద్ద పీట వేశారు. సంక్షేమంతో పాటు రాజకీయంగా వారికి తగిన ప్రాధాన్యత కల్పించారు. 2014 లోనే నలుగురు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముగ్గురిని గెలిపించారు. తొలిసారి ముస్లిం వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చాడు.ముస్లిం మహిళకు శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇచ్చాడు. 14 మంది ముస్లింలకు కార్పోరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చాడు. 33 మందికి డైరెక్టర్ పదవులు ఇచ్చాడు. 257 మందికి స్థానిక సంస్థల్లో పదవులు కట్టబెట్టాడు.