YouTube channel subscription banner header

బీజేపీ, టీడీపీలకు జనసేన గాజు గ్లాసు భయం

Published on

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమికి గాజు గ్లాసు సింబల్ షాక్ ఇస్తోంది. జనసేన పోటీలో లేని కొన్ని స్థానాల్లో టీడీపీ, జనసేన రెబెల్ అభ్యర్థులకు, స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ గాజు సింబల్‌ను కేటాయించింది. దీంతో బీజేపీ, టీడీపీలకు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఓట్ల బదలాయింపులో గాజు గ్లాసు ఏ మేరకు దెబ్బ తీస్తుందనే ఆందోళనలో బీజేపీ, టీడీపీ నాయకులు పడ్డారు. జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల్లోనూ 2 లోకసభ స్థానాల్లో ఆ సింబల్ ఆ పార్టీకే పరిమితమైంది. గాజు గ్లాసును ఈసీ ఫ్రీ సింబల్‌గా గుర్తించి మిగతా కొన్ని చోట్ల అభ్యర్థులకు ఆ సింబల్‌ను కేటాయించింది. గాజు గ్లాసును తమ పార్టీకే పరిమితం చేసుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించలేదు.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. జగ్గంపేటలో జనసేన రెబల్ అభ్యరిగా పోటీ చేస్తున్న పాఠంశెట్టి సూర్యచంద్రకు గాజు గ్లాసు గుర్తు దక్కింది. ఇక్కడ పొత్తుల్లో భాగంగా టీడీపీ సీటును జ్యోతులు నెహ్రూకు కేటాయించారు. దీంతో జనసేన నుంచి సూర్యచంద్ర తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేసి గాజు గ్లాసు గుర్తును దక్కించుకున్నారు. ఎస్.కోట జనసేన రెబల్ అభ్యర్థి రామకోటికి గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. మచిలీపట్నం, విజయవాడ పార్లమెంట్ పరిధిలోని స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించినట్లు సమాచారం. మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాసు కేటాయించారు. దీంతో ఎన్‌డీఏ నేతలు తీవ్రమైన కలవరానికి గురవుతున్నారు. స్వతంత్ర అభ్యర్థుల్లో కొందరు గాజు గ్లాసును తమ సింబల్‌గా ఎంచుకున్నారు. దానివల్ల టీడీపీ, బీజేపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఉందని భావించి, గాజు గ్లాసుకు ఓటర్లు ఓటు వేసే ప్రమాదం ఉందని ఎన్‌డీఏ కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.

జనసేన పోటీలో లేని కొన్ని స్థానాల్లో టీడీపీకి, బీజేపీకి స్వతంత్ర, రెబల్ అభ్యర్థులు గాజు గ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నందున నష్టం వాటిల్లే ప్రమాదం ఉండగా, జనసేనకు కూడా తాను పోటీ చేస్తున్న స్థానాల్లో మరో రకమైన ముప్పు పొంచి ఉంది. నవరంగ్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ జనసేన పార్టీలు జనసేనకు ఆందోళన కలిగిస్తున్నాయి. నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి జనసేన గాజు గ్లాసు గుర్తును పోలిన బక్కెట్ గుర్తు వచ్చింది. జనసేన అభ్యర్థుల పేర్లతోనే నవరంగ్ కాంగ్రెస్ పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీకి దిగింది.

జాతీయ జనసేన పార్టీకి పెన్నుల సెట్ బాక్సు గుర్తుగా వచ్చింది. ఇది జనసేన గాజు గ్లాసు గుర్తుకు దగ్గరగా ఉంది. ఓటర్లు సరిగా గుర్తించలేక జనసేన గ్లాసు గుర్తుకు బదులుగా బక్కెట్ లేదా పెన్నుల సెట్ బాక్సుపై ఓట్లు వేసే అవకాశం ఉందనే ఆందోళన జనసేన నేతల్లో ప్రారంభమైంది. జనసేనతో పొత్తు వల్ల తాము ఓట్లను కోల్పోతామనే భయం బీజేపీ, టీడీపీ నేతలను పట్టుకుంది. దానికితోడు, పలు నియోజకవర్గాల్లో జనసేన నాయకులు ఆ పార్టీని వీడి వైసీపీలో చేరారు. ఇది కూడా తమకు ప్రమాదం తెచ్చి పెట్టవచ్చునని టీడీపీ, బీజేపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...