ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్య విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించి, వారి కష్టాలను తీర్చడానికి ముందుకు వచ్చారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు తగిన సదుపాయాలు కల్పించడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందడుగు వేశారు. దానికితోడు, కిడ్నీ సమస్య మరింత వ్యాపించకుండా నీటి సదుపాయం కూడా కల్పించారు.
ఉద్ధానంలో జగన్ ప్రభుత్వం కిడ్నీ సెంటర్ను ఏర్పాటు చేసింది. దీన్ని 200 పడకలతో నిర్మించింది. ఇందుకోసం రూ. 85 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ కిడ్నీసెంటర్లో మూడు బ్లాకులున్నాయి. నాలుగు అంతస్థుల్లో నిర్మించిన ఈ సెంటర్లో 14 విభాగాలున్నాయి. మొత్తం 162 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు.
కిడ్నీ సమస్యకు ప్రధాన కారణం జలం కాబట్టి ఆ సమస్యను కూడా జగన్ ప్రభుత్వం పరిష్కరించింది. వైయస్ఆర్ సుజల ధార ప్రాజెక్టును చేపట్టింది. రూ.700 కోట్ల వ్యయంతో 1.12 టీఎంసీల సామర్ధ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. దాదాపు 132 కిలోమీటర్ల మేర పైపులైన్ వేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 112 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. ఈ గ్రామాల ప్రజలు కిడ్నీ సమస్య బారిన పడకుండా తగిన సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
వైద్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఉద్ధానం ప్రజల కష్టాలను తీర్చడానికి నడుం కట్టింది. ఇందులో భాగంగానే ఉద్ధానం కిడ్నీ సెంటర్, ఉద్ధానం వాటర్ ప్రాజెక్టు ఏర్పాటు జరిగింది.
గతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఉద్ధానం సందర్శించి హంగామా చేశారు. కానీ పరిష్కార దిశగా ఏమీ చేయలేకపోయారు. కానీ జగన్ ప్రభుత్వం నిబద్ధతతో వ్యవహరించి ఉద్ధానం ప్రజల కష్టాలు తీర్చింది.