పేద పిల్లల చదువులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాగంలా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నాడు – నేడు ద్వారా మెరుగుపరుస్తున్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కలిసి విడుదల చేసిన కూటమి మేనిఫెస్టోలో పేద పిల్లల కోసం జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు చోటు కల్పించలేదు. ఒకవేళ మళ్లీ బాబు అధికారంలోకి వస్తే కార్పోరేట్ విద్యా సంస్థలు విజృంభిస్తాయి. సర్కారీ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధనను ఆపేసినా ఆశ్చర్యం లేదు.