పౌరసత్వ బిల్లు(సీఏఏ)పై టీడీపీ, ఈనాడు మీడియా తప్పుడు ప్రచారానికి దిగుతున్నాయి. సీఏఏకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి, బిల్లుకు వైఎస్సార్ సీపీ బేషరతుగా మద్దతు ప్రకటించలేదు. పలు షరతులు పెట్టి వాటిని పరిగణనలోకి తీసుకుంటేనే తాము మద్దతు ఇస్తామని లోకసభలో వైఎస్సార్ సీపీ పక్ష నేత మిథున్ రెడ్డి చెప్పారు. ముస్లిం మైనారిటీల్లో దీనిపై ఉన్న భయాలను తొలగించాలని, వారి భద్రతకు భరోసా ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముస్లిం మైనారిటీలను కూడా మిగతా అందరితో సమానంగా చూడాలని ఆయన సూచించారు.
సీఏఏలో సవరణలు కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని వైఎస్సార్ సీపీ స్పష్టం చేసింది. ప్రస్తుతం యథాతధంగా బిల్లును ఆమోదించబోమని స్సష్టం చేసింది. సీఏఏకు షరతులతో కూడిన మద్దతును వైఎస్సార్ సీపీ ప్రకటించినప్పుడు ఎన్పీఆర్, ఎన్ఆర్సీలు లేవు. అందువల్ల కూడా సీఏఏను ఆమోదించడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా లేదు. ఈ విషయాన్ని గతంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పైగా దేశభద్రత, చొరబాట్లు, అక్రమ వలసల నిరోధం విషయంలో మాత్రమే వైసీపీ సీఏఏకు మద్దతు ఇచ్చింది.
ఇదిలావుంటే, సీఏఏ, యూసీసీలపై వైఎస్ జగన్ ఇటీవల టైమ్స్ నౌకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా స్పష్టత ఇచ్చారు. సీఏఏను, యూసీసీని రాష్ట్రంలో అమలు చేయబోమని ఆయన చెప్పారు. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉన్నవాటిని వేటినీ తాము రాష్ట్రంలో అమలు చేయబోమని ఆయన అన్నారు. ఇటీవల వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా సీఏఏపై మాట్లాడారు. తమ పార్టీ సీఏఏకు వ్యతిరేకమని ఆయన చెప్పారు. తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు.
టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు మాత్రం వాటిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ముస్లిం మైనారిటీల మనోభావాలను ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జగన్ మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు.