జనసేన పార్టీ నిర్లక్ష్యం కూటమిని కలవరపెడుతోంది. జనసేన గుర్తు అయిన గాజు గ్లాసును ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే. దీన్ని వెంటనే కోర్టులో సవాల్ చేసి ఉంటే గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించే విషయంలో ఈసీ పునరాలోచన చేసే అవకాశం ఉండేది. కానీ తీరా గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించాక జనసేన హైకోర్టును ఆశ్రయించింది. కానీ అప్పటికే గుర్తును కేటాయించినందువల్ల.. ఈ విషయంలో మధ్యంతర జోక్యానికి హైకోర్టు నిరాకరించింది.