టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. గతంలో 2014లో ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో దోస్తీ కట్టి.. ముస్లింల హక్కులకై పోరాడుతానని చెప్పడం చంద్రబాబు గందరగోళ రాజకీయానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలోనూ చంద్రబాబు గందరగోళ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ చట్టం తెచ్చిందే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వమని, అలాంటిది ఎన్డీయేతో పొత్తు పెట్టుకుని ఆ చట్టంపై విమర్శలు చేయడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.