ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు పూర్తిగా అబద్ధాలనే ప్రచారం చేస్తున్నారు. ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ సీపీని ఓడించడమే లక్ష్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం సాగిస్తూ ప్రజలను భయపెట్టే పనికి పూనుకున్నారు. ఈ చట్టంపై నల్సార్ లా వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ సవివరమైన వ్యాసం రాశారు. ఈ వ్యాసం చదివితే ఆ యాక్ట్ మీద ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. సునీల్ కుమార్ రాసిన వ్యాసం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం..