ఈనాడు రామోజీరావు భూబాగోతం ఒక్కటి వెలుగు చూసింది. ఇలా ఆయన ఎన్ని స్థలాలను కబ్జా చేశారో తెలియదు గానీ ఇది మాత్రం ఆయన భూకబ్జాల తీరుకు ఉదాహరణగా నిలుస్తోంది. మీడియాను అడ్డం పెట్టుకుని అక్రమాలు సాగిస్తున్న వైనానికి ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని రామోజీరావు తాపత్రయపడుతుంది కూడా ఇటువంటి అక్రమాలను నిర్లజ్జగా చేయడానికేనని చెప్పవచ్చు. కర్నూలు నగరంలో ముస్లిం మైనారిటీలకు చెందిన భూమిని కబ్జా చేసిన విషయం వెలుగు చూసింది. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలో గల సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమిని ఆయన ఆక్రమించారు. తన పలుకుబడిని వాడుకుని పత్రికను అడ్డం పెట్టుకుని ఆ విలువైన భూమిని కాజేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులను, కోర్టులను కూడా బేఖాతరు చేస్తూ ఈ భూమి తనదేనంటూ ఓ బోర్డు తగిలించారు.