వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమం నేరుగా చేరుతోంది. వాలంటీర్ వ్యవస్థ పనితీరుతో జగన్ ప్రభుత్వానికి మంచి పేరు రావడం చంద్రబాబుకు కంటగింపుగా మారింది. దీంతో ముందు నుంచి వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు పన్నుతూనే ఉన్నారు. గతంలో వాలంటీర్లపై లేని పోని ఆరోపణలు చేసిన చంద్రబాబు అండ్ కో.. ఎన్నికల వేళ కుట్రలను మరింత తీవ్రం చేశారు. నిమ్మగడ్డ రమేష్ అనే మాజీ ఐఏఎస్ అధికారి ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి.. వాలంటీర్లు ఫించన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారు. దీంతో ఎర్రటి ఎండల్లో అవ్వాతాతలు ఫించన్ డబ్బుల కోసం బ్యాంకుల ముందు క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి తలెత్తింది. కొన్నిచోట్ల ఎండ దెబ్బ కారణంగా కొందరు వృద్ధులు ప్రాణాలు విడిచారు. ఈ పాపం కచ్చితంగా చంద్రబాబుదే అనడంలో సందేహం అక్కర్లేదు.