YouTube channel subscription banner header

ఎవ‌రీ రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమ‌ర్స్‌లో నిజ‌మెంత‌..?

Published on

టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య నిశ్చితార్థం తర్వాత అందరి దృష్టి ఆయన మాజీ భార్య సమంతపై పడింది. చైతూ-శోభిత‌ల ఎంగేజ్‌మెంట్‌పై సామ్‌ రియాక్ట్ అవుతుందా? లేదా అని ఫ్యాన్స్‌ వేచిచూశారు. కానీ చైతూ ఎంగేజ్‌మెంట్‌ గురించి ఎక్క‌డా మాట్లాడ‌లేదు, సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే సమంతపై డేటింగ్‌ రూమర్స్ మొదలయ్యాయి. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్‌లో ఉందంటూ రూమర్స్‌ వినిపిస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరు త్వరలోనే ఎంగేజ్‌మెంట్‌ కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలొచ్చాయి.

ఈ ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా.. అసలు సమంతకు రాజ్‌ ఎలా పరిచయం? అసలు అతని బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటి? అంటూ నెటిజన్స్‌ తెగ ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో రాజ్ నిడిమోరు జన్మించారు. ఇంజినీరింగ్ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి డీ2ఆర్‌ ఫిల్స్మ్‌ అనే బ్యానర్‌ను స్థాపించారు. మొదట వీరిద్దరు షాదీ అనే షార్ట్‌ ఫిలిం తెరకెక్కించారు. ఆ తర్వాత నిర్మించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్ సిరీస్‌తో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం వీరిద్దరు సిటాడెల్‌ ఇండియన్ వర్షన్ హనీ బన్నీ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత, వరుణ్ ధావన్ జంటగా నటిస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ నుంచి రాజ్‌, సమంతకు పరిచయం ఉండడం వల్లే తాజాగా డేటింగ్‌ రూమర్స్‌ వస్తున్నాయి. అయితే రాజ్‌ నిడిమోరుకు ఆల్రెడీ పెళ్లైంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...