అచ్యుతాపురం సెజ్‌లోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిపోవడంతో 18 మంది మృతిచెందారు. దాదాపు నాలుగు పదులకు పైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీనిపై ప్రభుత్వమే కాస్త ఆలస్యంగా స్పందించిందని అందరూ అనుకుంటుంటే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరీ లేటుగా రియాక్ట్ అయ్యారు. ఈరోజు ఉదయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గ్రామసభలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఓ విలేకరి అచ్యుతాపురం ఘటనపై ప్రశ్న అడగ్గా అప్పుడు స్పందిస్తూ పవన్ సమాధానం చెప్పారు.
https://x.com/KrishnaveniYCP/status/1826570804340920603
`ఒక అడుగు ముందుకు వేయడానికి ఎందుకు సంకోచిస్తున్నానంటే.. ఒక్కోసారి అది ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉండకూడదు. సేఫ్టీ ఆడిట్ చేస్తే పరిశ్రమలు వెళ్లిపోతాయనే వధంతు ఉంది. కనీస భద్రత అనేది పరిశ్రమలు ఇవ్వాల్సింది కదా..` అని మాట్లాడారు.
ఇదే పవన్ కళ్యాణ్ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై గతంలో మాట్లాడుతూ.. `విష వాయువు లీకైనప్పుడు ఓ మహిళ నిద్రలోనే చనిపోయిందని, అక్కడున్న ఎమ్మెల్యే, మంత్రి ఎవడైనా సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే రూ.కోటి పరిహారం ఇచ్చామని మాట్లాడొచ్చా`.. అని ప్రశ్నించిన వీడియోను కొందరు వెలికితీశారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో పవన్ మాట్లాడిన మాటలు, నేడు అచ్యుతాపురం ఘటనపై మాట్లాడిన వ్యాఖ్యలతో పోల్చుతూ.. అధికారం లేకపోతే ఒకలా.. అధికారంలో ఉండగా మరోలా పవన్ మాట్లాడిన మాటలకు వ్యత్సాసం చూడండి అంటూ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్టు చేస్తున్నారు.