సీఎం రేవంత్ రెడ్డి పాలనపై మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహబూబ్‌నగర్‌లో వికలాంగులు,పేదల ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పంచుకున్న కేటీఆర్.. బుల్డోజర్లే పరిష్కారమని నమ్మే మూర్ఖపు పాలనకు ఈ చిత్రాలే నిదర్శనమంటూ మండిపడ్డారు.
మహబూబ్‌నగర్‌లో తెల్లవారుజామున 3 గంటలకు దళిత కాలనీలోని 75 ఇళ్లను రేవంత్ సర్కార్ నేలమట్టం చేసిందని మరోసారి గుర్తుచేశారు. ఇందులో దాదాపు 25 కుటుంబాలు వికలాంగులకు చెందినవని, వారంతా బలవంతంగా తమ ఇళ్లలో నుంచి నెట్టివేయబడడం విషాదకరమన్నారు.
మహబూబ్‌నగర్‌లో కూల్చివేతలకు సంబంధించి మొత్తం 4 ఫొటోలను తన ట్విట్టర్లో పంచుకున్నారు కేటీఆర్. నాలుగు ఫొటోలు హృదయవిదారకంగా ఉన్నాయి. ఈ ఫొటోలకు బుల్డోజ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫేయిల్డ్ తెలంగాణ హ్యాష్‌ట్యాగ్ జత చేశారు కేటీఆర్.